జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే గ్రామాల్లోని ప్రజలు అందరికీ ఎంతో సమర్థవంతంగా సేవలు అందించే దిశగా ఏకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను తీసుకు వచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే ఇటీవలే  ఏపీలో లోకల్ ఎన్నికలు పూర్తయ్యాయ్. ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత లోకల్ ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు ఇక గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు సీఎం జగన్.


 ఇక గ్రామ పంచాయతీ లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరికీ ఇక గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ ప్రభుత్వం కొత్త సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఇక ఈ ట్రైనింగ్ లో పాల్గొనాలి అంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 14వ తేదీ వరకు కూడా ఈ శిక్షణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.




 ఈ శిక్షణలో భాగంగా ఇక సర్పంచులు తమ గ్రామపంచాయతీలో అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలా ముందుకు సాగాలి అనే దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా  గ్రామపంచాయతీ పాలన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రభుత్వ పథకాలు ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇక ఆయా గ్రామాల్లోని పారిశుధ్యం పై కూడా సర్పంచులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఈ శిక్షణ లో రాష్ట్రంలోని 13 వేల 95 సర్పంచులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.  ఇక దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 60 సెంటర్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలకు ఈ సమావేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: