ఎన్నో రోజుల నుంచి అటు టెలికాం రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి  ఒకప్పుడు ఇంటర్నెట్ వాడకం అంటే అదృష్టంగా భావించేవారు అందరూ. కానీ ఇప్పుడూ అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు అటు పలు టెలికాం రంగం సంస్థలు తమ నెట్వర్క్ కు సంబంధించి అందిస్తున్న సిమ్ కార్డ్  పరిమాణం కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ఒక అంగుళం అంత ఉండేది సిమ్ కార్డు. ఇక ఆ తర్వాత అర అంగుళం గా మారిపోయింది. ఇక ఇప్పుడు మైక్రో సిమ్ కార్డు అంటూ అర అంగుళం కూడా ఉండటం లేదు.


 అంతేకాదు నేటి రోజుల్లో ఇసిమ్ కార్డు పేరుతో ఎక్కడ కంటికి కనిపించని సిమ్ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు ఎంతోమంది  ఒకవేళ మీరు స్మార్ట్ వాచ్ లేదా ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ సిమ్ కార్డులు  ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ సిమ్ కార్డు అందిస్తున్న నెట్వర్క్ లలో భారతీ ఎయిర్టెల్  కూడా ఒకటి. ఇలా ఈ సిమ్ కార్డు పొందేందుకు ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అయితే మీరు ఈ సిమ్ కార్డు ఉపయోగించాలి అనుకుంటే ముందుగా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం  మీరు మీ మొబైల్ లోని రెండవ సిమ్ కార్డు బదులుగా ఇక ఈ సిమ్ కార్డు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీ భౌతిక సిమ్ నీ ఈ సిమ్ కార్డుగా  మార్చే ప్రక్రియ కూడా ఎంతో కష్టతరం గానే ఉంటుంది



 మీరు ఈ సిమ్ కార్డు తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీ ఈమెయిల్ ఐడి ని లింక్స్ చేయాల్సి ఉంటుంది ఎయిర్టెల్ థాంక్స్ యాప్ కి వెళ్లి కూడా మీ ప్రొఫైల్ విభాగంలో మీ ఈమెయిల్ ఐడి ని లింక్ చేసేందుకు అవకాశం ఉంటుంది  లేదా 121 నెంబర్ కి మీ ఈమెయిల్ ఐడి ని పంపించడం ద్వారా కూడా ఎయిర్టెల్ ఈ సిమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కేవలం ఒకే సారి ప్రయత్నించడం ద్వారా ఇలా ఈ సిమ్ కార్డు కి ఇమెయిల్ ఐడి లింక్ చేయడం జరిగదు.  పలుమార్లు  ప్రయత్నించడం ద్వారా ఉపయోగం ఉంటుందట. ఒకవేళ మీ ఈ సిం కార్డు కోసం రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ అయితే ఇక ఆ తర్వాత ఫోన్ లోపల ఉన్న భౌతిక సిమ్ పని చేయదట. అంతేకాదు ఇక ఈ సిమ్ కార్డ్ ఆక్టివేట్ అవుతుంది అనుకున్న సమయంలో ఇక 24 గంటల పాటు మీ ఫోన్ నుంచి కాల్స్ మెసేజ్లు చేయడం లాంటివి అస్సలు చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: