ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ క్రియేటర్లందరికీ గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇందులో భాగంగా గూగుల్ యూట్యూబ్ లో " సూపర్ థ్యాంక్స్ " అనే పేరిట ఓ మనీ మేకింగ్ ఫీచర్‌ ను కొత్తగా క్రియేటర్ ల కొరకు ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో యూట్యూబ్ క్రియేటర్లు వారు సంపాదిస్తున్న ఆదాయం కంటే మరింతగా ఆదాయం పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ ను ప్రస్తుతం బీటా దశలో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి ప్రస్తుతం బీటా క్రియేటర్లకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ముందు ముందు ఆపి త్వరలోనే యూట్యూబ్ క్రియేటర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ క్రియేటర్ ను మరింతగా సంపాదించే అవకాశం ఉంది.

ఇదివరకు కాలంలో ' సూపర్ చాట్ ' ఫీచర్‌ ను యూట్యూబ్ అందుబాటులోకి తెచ్చిన విషయం మనందరికీ విదితమే. అచ్చం ఇలాగే ఇప్పుడు " సూపర్ థ్యాంక్స్ " అనే ఫీచర్ కూడా అలాగే పనిచేస్తుంది. ఇందులో వీక్షకులు ఎలాగైతే డబ్బును డొనేట్ చేయవచ్చో " సూపర్ థ్యాంక్స్ " అనే ఆప్షన్ ద్వారా కూడా డబ్బును పొందవచ్చు.

ఈ ఆప్షన్ ద్వారా మినిమం 5 డాలర్ల నుండి 50 డాలర్ల వరకు గరిష్టంగా ఇందులో క్రియేటర్లకు వ్యూయర్స్ డబ్బులు డొనేషన్ రూపంలో అందించవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ 68 దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇరువురి యూజర్లకు లభిస్తోంది. అంతేకాదు " సూపర్ థ్యాంక్స్ " ను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకమైన యానిమేటెడ్ జిఫ్ కూడా అందిస్తోంది గూగుల్. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక బోనస్‌, కామెంట్ల లలో గుర్తింపు లభిస్తాయి. యూట్యూబ్‌ లో 2017 లో సూపర్ చాట్ ఫీచర్ అందుబాటులోకి రాగా 2019 లో సూపర్ స్టిక్కర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు. అచ్చం అలాగే ఇప్పుడు సూపర్ థ్యాంక్స్‌ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది గూగుల్. చూడాలి మరి ఈ కొత్త ఆప్షన్ యూట్యూబ్ యూజర్లను ఎలా ఆకట్టుకుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: