రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతి విషయంలో కూడా రాజకీయం చేసే విధంగా అడుగులు వేయటం ప్రధాన సమస్యగా మారిన అంశం. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో వివాదాలను ఎక్కువగా తెచ్చుకుంటున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒకే ఒకరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. దీనివలన చాలా వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయారు. కొంతమంది బిజెపి కార్యకర్తలలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. తెలంగాణ నుంచి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర  కేబినెట్ లో ఉండే అవకాశాలున్నాయని ఒక సహాయ మంత్రి పదవి కూడా తెలంగాణకు దక్కే అవకాశం ఉండవచ్చని అంచనా వేశారు.

కానీ అది కూడా నిజం కాదని తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కిషన్ రెడ్డి ఒక్కరే తెలంగాణలో బలమైన నాయకుడిగా కనబడుతున్నారు అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే బండి సంజయ్ లేదా ధర్మపురి అరవింద్ కనీసం ఒక్కరినైనా కేబినెట్ లోకి తీసుకుని ఉంటే బాగుండేదని... బండి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ధర్మపురి అరవింద్ ను అయినా కేంద్ర కేబినెట్ లో ఎంపిక చేసి ఉంటే మంచి ఫలితం ఉండేది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏ విధంగా ముందడుగు వేస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp