ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రధానంగా తాడేపల్లి లో ఆయన నివాసం ఉండే ఇంటి సమీపంలో ఉన్న కొన్ని ఇళ్ళ లో కూల్చివేయడం కాస్త వివాదాస్పదంగా మారింది. రాజకీయంగా కూడా దీనిపై పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో భద్రతా సమస్యల కారణంగా... ఈ విధంగా పేదల ఇళ్లను కూల్చివేయడం ముఖ్యమంత్రికి ఖచ్చితంగా వ్యతిరేకత తీసుకొస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

ఉన్న ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడంతో అక్కడున్న ప్రజలు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ఈ విధంగా ఖాళీ చేయించడం ద్వారా అధికారులు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడి స్థానికులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.

ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని అంతేకాకుండా కూల్చివేస్తామని ప్రకటించడంతో వాళ్లకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా వైసిపి కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది వైసీపీ కార్యకర్తలు దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాఋ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే వివాదాస్పద నిర్ణయంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం కారణంగా జగన్ ప్రజల్లో దోషిగా నిలబడే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. పేద ప్రజలలో ఆయన పై వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో జగన్ జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా రావడమే కాకుండా పార్టీపై వ్యతిరేకత మాత్రమే కాకుండా జగన్ పై వ్యతిరేకత ప్రజల్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: