తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని పట్టుదలగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న పరిస్థితులు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా సరే సీఎం కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునే ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా నియమించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాస్త రాష్ట్రంలో ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు.

అదే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాఋ. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లలేక పోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ప్రధానంగా దళిత ఓటుబ్యాంకు విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ దృష్టి సారించింది అనే ప్రచారం కూడా వినపడుతోంది. అదేవిధంగా మరి కొంతమంది విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పనిచేయని ఎమ్మెల్యేల విషయంలో కూడా సీఎం కేసీఆర్ అలెర్ట్ కాకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. అలాగే అవినీతి విషయంలో,  ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ తో కలిసి వచ్చిన వారి విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. అదేవిధంగా తనపై వ్యతిరేకత ఉన్న వాళ్ళలో అభిప్రాయాన్ని మార్చే విధంగా కూడా కేసీఆర్ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: