బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు.. ఆకర్షిత ప‌థ‌కాలను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల్లో ల‌బ్ధి అందుకునేందుకు రూపుదిద్దుకున్న ప్ర‌ణాళిక‌లు సుదీర్ఘ కాలం  ప‌నిచేయ‌కున్నా సంబంధిత వ‌ర్గాల‌కు కాస్తంత ఊర‌ట ఇస్తాయ‌న్న‌ది ఓ ప‌రిశీల‌న. రాజ‌కీయం ఎలా ఉన్నా కాపు సామాజిక వ‌ర్గాలు తాము అనుకున్న విధంగా కార్పొరేష‌న్ ఏర్పాటు అలానే నిధుల విడుద‌ల స‌కాలంలో కాపు నేస్తం కు సంబంధించిన తాయిలాలూ అందుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. ఇప్ప‌టికే 17 ర‌కాల ఆర్థిక  సంబంధ ప‌థ‌కాల అముల‌తో దేశంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌బ్లిక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున నిధులు బ‌దిలీ చేస్తున్న జ‌గ‌న్ త‌న‌కు సంక్షేమం క‌న్నా ఎన్నిక‌ల నాటి ప్ర‌క‌ట‌న‌లూ , హామీలే ముఖ్య‌మని తేల్చేశారు. ఇవ‌న్నీ వైసీపీకి చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే ద‌క్కుతున్నాయా అన్న‌ది ఓ ప్ర‌శ్న.. ఇది విప‌క్షం నుంచి స‌మాధానం తెప్పించుకుని తీరాల్సిన ప్ర‌శ్న. కాదండి అన్ని పార్టీలూ అన్ని ప్రాంతాలూ స‌మానంగా ఈ ప‌థ‌కాల ల‌బ్ధి పొందుతున్నారంటే నో కామెంట్.. కాపు బ‌లిజ తెల‌గ ఒంట‌రి కులాల‌కు కార్పొరేష‌న్లు చైర్మ‌న్లూ అన్నీ కేటాయించిన జ‌గ‌న్ ఆ మేర‌కు ముందున్న కాలంలో ఆయా సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు ఎలా అందుకుంటార‌న్న‌ది కీల‌కం.
 
రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేయాల‌నుకుంటున్న చేస్తున్న ప‌థ‌కం కాపు నేస్తం. ఆర్థికంగా వెనుక‌బ‌డి ఉన్న కుటుం బాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచేందుకు ఈ ప‌థ‌కం ఆస‌రా ఇస్తుంద‌ని 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మ‌హిళ‌ల‌కు ఇది ఊతం ఇ స్తుంద న్న‌ది సీఎం మాట..ఆ మాట ప్ర‌కారం వ‌రుస‌గా రెండో ఏడాది  ఈ ప‌థ‌కం అమ‌లుకు సై అన్నారు సీఎం. కాపు నేస్తంకు సం బంధించి ఇప్ప‌టికే ఒక విడ‌త  నిధులు విడుద‌ల చేసిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ .. ప‌థ‌కం అమ‌లులో భాగంగా ప్రతి ఏడాది 15 వేల రూపా యలు చొప్పున ఐదేళ్ల పాటూ అందించేందుకు ఈ పథకాన్ని రూపకల్పన చేశామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించా రు. ఆ మేర కు కొన్ని అవంతారాలు ఉన్నా వాటిని అధిగ‌మిస్తూ ఇచ్చిన మాట‌కు క‌ట్టు బ‌డి ఉన్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని వైసీపీ నేత‌లు చెబుతు న్నారు. శ్రీ‌కాకు ళం జిల్లాకు సంబంధించి 8.45 కోట్ల రూపాయలను 5,635 మంది లబ్ధిదారులకు అందించామ‌ని  క‌లెక్ట‌ర్ శ్రీ‌కేష్ బి. లాఠ‌క‌ర్ తెలిపా రు. రాష్ట్ర‌వ్యాప్తంగా  వివ‌రాలు చూసుకుంటే  3,27,244 మందికి రూ.490.86 కోట్లను జమ చేస్తున్నా మని, రెండు విడతల్లో రూ.981.88 కోట్లను ఆర్థిక సహాయంగా అందించామ‌న్న‌ది సీఎం వ‌ర్గాలు చెబుతున్న మాట. ఈ నేప‌థ్యంలో శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో స్పీక‌ర్ త‌మ్మినేని  సీతారాం ల‌బ్ధిదారుల‌కు న‌మూనా చెక్ అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు. మ‌రోవైపు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌థ‌కాల‌కు మాత్ర‌మే నిధులు వెచ్చించి, సంక్షేమం మాట విస్మ‌రిస్తున్నార‌న్న‌ది  ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: