తమ దేశ అంత‌ర్గ‌త విష‌యంలో ఏ దేశం త‌ల‌దూర్చినా.. మాట్లాడినా ఆ డ్రాగ‌న్ దేశం భ‌గ్గున లేచి కూర్చుంటుంది. ఇదే క్ర‌మంలో తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న జ‌పాన్‌ను చైనా తీవ్రంగా హెచ్చ‌రించింది. తైవాన్‌పై త‌మ దేశానికే పూర్తి స్థాయి హ‌క్కు ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఈ విషయంలో త‌ల దూరిస్తే అణు బాంబ‌లు వేస్తామ‌ని తీవ్ర వాఖ్య‌లు చేసింది. అవ‌స‌రం అయితే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌ని జ‌పాన్‌ను చైనా హెచ్చరించింది. ఇదే విష‌యంపై  సందేశంతో కూడిన విడియోను స్టేట్ మీడియా ప్ర‌సారం చేసింది.


    తైవాన్‌లో చైనా ఆక్ర‌మ‌ణ‌ను ఆ దేశం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. పైగా త‌మ దేశాన్ని ర‌క్షించాల‌ని అమెరికా, భార‌త్ వంటి దేశాల నుంచి ర‌క్ష‌ణ‌కు తైవాన్ కోరుతోంది.  ఏడు ద‌శాబ్దాలుగా తైవాన్ పై త‌మ‌కే హ‌క్కు ఉంద‌ని అటు జ‌పాన్‌, ఇటు చైనా వాదిస్తూనే ఉంది.  పోయిన సంవ‌త్స‌రం చైనా.. తైవాన్ భూభాగంపైకి త‌మ ఫైట‌ర్ జెట్ విమానాల‌ను పంపించింది. అయితే త‌మ దేశ సార్వ‌భౌమాధికారాన్ని జ‌పాన్ ర‌క్షించాల్సి ఉంటుంద‌ని తైవాన్ డిప్యూటీ ప్ర‌ధాని కోరారు. ఈ విష‌యం పై జ‌పాన్ అధికారుల రెండు వారాల ముందు స్పందించారు.

  అణ్వాయుధాలు లేని దేశాలపై అణుబాంబుల‌ను చైనా ప్రయోగించబోద‌ని త‌మ దేశం పాలసీగా పెట్టుకుంద‌ని, ఏదిఏమైనా.. తైవాన్ అంశంపై జపాన్ క‌లుగ‌జేస‌కుంటే మాత్రం.. లొంగిపోయేంత‌వ‌ర‌కు అణుబాంబుల‌ను ప్ర‌యోగిస్తూనే ఉంటామ‌ని ఈ వీడియోలో చైనా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ విడియోకు 20 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. అనంత‌రం ఆ దేశ‌ సోష‌ల్ మీడియా అయినా `జిగువా` లోంచి ఈ విడియోను తొల‌గించారు. అప్పటికే యూజర్లు దీన్ని యూట్యూబ్, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ మీడియాలో అప్లోడ్ చేసి వైర‌ల్ చేశారు. ఈ విడియోపై జ‌పాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

  దీంతో డ్రాగ‌న్ కంట్రీ ఈ విధంగా వీడియో విడుద‌ల చేసింది.  17వ శతాబ్దం అనంత‌రం మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో తైవాన్‌, పెంగు సామ్రాజ్యాల‌ను జ‌పాన్ అప్ప‌గించింది. రెండ‌వ ప్ర‌పంచ యుద్దం అనంత‌రం చైనా, జ‌పాన్ క‌మ్యునిస్టుల ప్ర‌భావంతో చైనా తైవాన్‌పై పై చేయి సాధించింది. త‌రువాత చైనా నుంచి అనేక మంది తైవాన్‌కు వెళ్ల‌డంతో అక్క‌డ చైనా జ‌నాభా పెరిగిపోయింది. స్వాతంత్య్రం అనంత‌రం పొందిన తైవాన్‌.. చైనా నుంచి త‌మ దేశం స్వ‌తంత్ర సార్వ‌బౌమాధిక దేశంగా ఉండాల‌ని తైవాన్ భావిస్తూ వ‌స్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: