ఈ మధ్యన ఫోన్ ట్యాప్ ల బెడద ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ముఖ్యమైన రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేమిటి ఎంతోమంది ఫోన్ లను ట్యాప్ చేస్తూ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన పెగాసస్ స్పై వేర్ ఇదంతా చేస్తోందని తెలుస్తోంది. ముందు ముందు మన దేశం ఒక నిఘా దేశంగామారే ప్రమాదం ఉందని విపక్షాలన్నీ అధికార ప్రభుత్వం బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం సామాన్యుడిలోనూ వణుకు పుట్టిస్తోంది. అయితే ఇది ఇలా ఉంటే, ఈ విధంగా ఒకరికి సంబందించిన ఫోన్ లను కానీ, లేదా కంప్యూటర్ ను కానీ ట్యాప్ చేయడానికి వారి సమాచారాన్ని దొంగిలించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం.

2016 సంవత్సరం నాటికి, ఎన్ఎస్ఓ అనే ఒక స్పై వేర్ గ్రూప్ కేవలం ఈ సాఫ్ట్ వారే ఇన్స్టలేషన్ కొరకు 3.7 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లుగా సమాచారం ఉంది. మరియు ఒక 10 ఐఫోన్ లను లేదా ఆండ్రాయిడ్ ఫోన్ లను ట్యాప్ చేయడానికి 4.84 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా 5 బ్లాక్ బెర్రీ ఫోన్స్ ను ట్యాప్ చేయడానికి 3.7 కోట్ల రూపాయలు తీసుకోనున్నారు. 5 సింబియన్ యూజర్ల ఫోన్ లను ట్యాప్ చేయడానికి 2.25 కోట్ల రూపాయలను ఛార్జ్ చేయనున్నారు. ఇలా కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో ట్యాప్ చేయాలంటే అందుకు సరిపడా చార్జీలను తీసుకుంటారని తెలుస్తోంది.

ఇవి కాకుండా కస్టమర్ ఇచ్చిన టార్గెట్ కోసం సంవత్సరం మొత్తం అయిన ఖర్చులో 17 శాతం వరకు ఫీజు చెల్లించవలసి వస్తుంది. మరియు ఏమైనా సాఫ్ట్ వేర్ లో రిపేర్ లు వస్తే వాటికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే మన దేశంలో ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా 300 టార్గెట్స్ ను ట్యాప్ చేయడానికి 56 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.  ఈ సేవలను అందుకుంటున్న వారిలో దాదాపుగా 50 శాతం వరకు బిజినెస్ మాన్ లని తెలుస్తోంది. మరియు 11 శాతం మిలిటరీ రంగానికి చెందిన వారు, 38 శాతం వరకు న్యాయవ్యవస్థకు చెందినవారుగా ఒక వెబ్సైటు తెలిపింది. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశంలోని సైబర్ కార్యకలాలు నిర్వహించే కంపెనీలు ప్రతి సంవత్సరం 1 బిలియన్ డాలర్ లకు పైగా సంపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: