బీజేపీ దేశ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. బీజేనీ పొలిటికల్ గా టచ్ చేయడం కష్టమే అన్న మాట ఈ మధ్య దాకా ఉండేది. కానీ సీన్ మొత్తం మారిపోయింది. ఇక బీజేపీ ఏడేళ్లుగా చాలా తెలివిగా పార్లమెంట్ లో తాను అనుకున్నది సాధిస్తూ వస్తోంది.

కానీ ఇపుడు మాత్రం అంతా రివర్స్ లో ఉంది. రాజ్యసభలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందడం కష్టమని అంటున్నారు. వైసీపీ లాంటి పార్టీలు గట్టిగానే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. రెండేళ్ళ పాటు చూసి చూసి విసిగిపోయిన వైసీపీ ఏకంగా బీజేపీ కి తన నిరసన వ్యక్తం చేస్తోంది. బీజేపీకి దీంతో ఉక్క బోతలాగానే ఉంది అంటున్నారు.

రాజ్యసభలో ఈసారి అనేక కీలకమైన బిల్లులు ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తోంది. వర్షాకాల సమావేశాలలో దాదాపుగా 29 బిల్లులను బీజేపీ ప్రవేశపెడుతోది. లోక్ సభలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదు. కానీ పెద్దల సభకు వచ్చేసరికి మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ విషయంలో చిన్న పార్టీల ఆసరాతోనే ఇంతకాలం బీజేపీ నెట్టుకువచ్చింది. మరి ఈ సమావేశాలలో బిల్లులు ఆమోదం పొందడానికి బీజేపీ ఏ రకమైన విధానాన్ని అనుసరిస్తుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

బీజేపీకి అయితే టెన్షన్ గట్టిగానే పట్టుకుంది అంటున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలు అన్నీ ఒక్కటై సమరశంఖమే  పూరిస్తున్నాయి. దీంతో సభ సజావుగా సాగడంలేదు. ప్రతీ రోజూ వాయిదాలా పర్వమే కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ బిల్లులు చట్టాలుగా మారడం అంటే ఈసారి చాలానే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. చూడాలి మరి బీజేపీ చాణక్యులు ఏ రకమైన వ్యూహాలు రూపొందిస్తారో. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి ఇది ఆరంభం మాత్రమేనని కూడా మాట వినిపిస్తోంది. ఇక పైన ప్రతీ బిల్లు ఆమోదం కూడా అగ్నిపరీక్షగానే ఉంటుంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

bjp