సీబీ ఐ రిపోర్ట్ : క‌డప‌లో ఏం జ‌రుగుతోంది ? సుపారీ ఇచ్చిందెవ‌రు?

ఒక హ‌త్య రెండేళ్ల కాల వ్య‌వ‌ధి
ఈ లోగా ద‌ర్యాప్తు అధికారి మారిపోయారు
డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో జ‌రిగిన ద‌ర్యాప్తు ఎస్పీ పరిధిలోకి వెళ్లిపోయింది
ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయంలో కీల‌కం సీబీఐ లో ఎందుకీ మార్పు ?
సీబీఐ చేస్తున్న తాత్సారం చేయ‌డంతో కేసు నీరుగారుతుందా లేదా  
ఈ త‌ర‌హా కాల‌యాప‌న‌కు కార‌ణం ఏమ‌యినా ఉందా ?
అన్న‌ది వివేకా అభిమానుల క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణం...
రెండు రోజులుగా జ‌మ్మ‌ల‌మడుగులో ఏం జ‌రుగుతోంది
164 స్టేట్మెంట్ ప్ర‌కారం
వివేకా ఇంటి వాచ్ మెన్ రంగ‌య్య ఏం చెప్పాడు ?

నల‌భై ఐదు రోజులుగా క‌డ‌ప‌లో సీబీఐ అధికారులు అదే ప‌నిగా ప‌నిచేస్తున్నారు. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకా హ‌త్య కేసుకు సంబంధించి ఓ కీల‌క స‌మాచారం వారికి అందింది. జ‌మ్మ‌ల మ‌డుగు మేజిస్ట్రేట్ ఎదుట ఓ సాక్షిని ప్ర‌వేశ పెట్టి ఈ స‌మాచారం రాబ‌ట్టార‌ని తెలుస్తోంది. ఈ కేసు కేవ‌లం హ‌త్యా రాజ‌కీయమే కాద‌ని భారీ మొత్తంతో ముడిప‌డిన అంశ‌మ‌ని ప్రాథ‌మికం గా తేలిన విష‌యం. సౌమ్యుడు వివేకాకు శ‌త్రువులున్నారా ఉంటే ఎవ్వ‌రు అదీ ఎన్నిక‌ల ముందే హ‌త‌మార్చేందుకు కార‌ణం ఏంటి?

 ఆశ్చ‌ర్యం క‌లిగించే ప‌రిణామం
ఎట్ట‌కేల‌కు ఓ ఇద్ద‌రు ఈ కేసులో కీలకం
అని తేల్చిన ద‌ర్యాప్తు బృందం
ఎనిమిది కోట్ల మొత్తాన్ని ఏ ఇద్ద‌రు స‌మ‌కూర్చారు ?

డ‌బ్బులు మాట్లాడ‌తాయి డ‌బ్బులు ప్రాణాలు తీస్తాయి నోట్ల క‌ట్ట‌ల కార‌ణంగా సోకిన వైర‌స్ ఇది అని కూడా అనుకోండి అలా ఎనిమిది కోట్ల సుపారీ అందించి చేయించిన ఈ కిరాయి హ‌త్య‌కు సూత్ర‌ధారులెవ్వ‌రో తేల్చాల్సింది సీబీఐ.. ఇప్ప‌టికే ద‌ర్యాప్తు ఆల‌స్యం అవుతుంద‌న్న కోపంతో ఉన్న వివేకా కుటంబ స‌భ్యులకు తాజా ప‌రిణామం కాస్త ఊర‌ట. వాచ్ మెన్ రంగ‌య్య కొంద‌రు హంత‌కులకు సంబంధించి స‌మాచారం అందించార్త వార్త క‌డప జిల్లా అంత‌ట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. హ‌త్య‌లో పాల్గొన్న‌ది ఎవ‌రు సుపారీ ఇచ్చింది ఎవ‌రు ఎనిమిది కోట్ల మొత్తాన్ని ఏ ఇద్ద‌రు స‌మ‌కూర్చారు అన్న‌ది మేజిస్ట్రేట్ కు రంగ‌య్య చెప్పార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: