ఇంటి గొడ‌వ‌ను వీధి వ‌ర‌కూ తీసుకు రావొద్దు అని కొంద‌రు చెప్తారు.. కానీ అనూహ్యంగా త‌న తండ్రి అనుమానాస్ప‌ద మృతి అనం త‌రం ఆమె  రావాల్సి వ‌చ్చింది. వ‌చ్చాక కొన్ని మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. చాలా రోజులు సెంట‌ర్ పాయింట్ గా నిలిచా రు. అటుపై ఆమె మౌనం వ‌హించారు.. ఎందుక‌నో జ‌గ‌న్ స‌ర్కార్ పై కూడా మాట్లాడ లేదు.. కొంద‌రు ఆమెతో జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా మాట్లాడించాల‌ని ప్రయ‌త్నించారు కూడా! కానీ అవేవీ ఫ‌లించ‌క కొంత నిరాశ‌తో మీడియా ఉండిపోయింది..

మీడియా కోరుకున్నంత
ఆ ఇంట విభేదాలు లేకున్నా
ఓ వ‌ర్గం ఆమె మాట్లాడితేనే చాలు
పండుగ చేసుకుంది..అలాంటి అప‌ఖ్యాతి
ఒక‌టి ఓ వ‌ర్గం మీడియా ద‌క్కించుకుంది
ఏదైతేనేం
కొంద‌రు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కం కావాల‌ని అనుకుంటారు.. కానీ కొంద‌రు అనూహ్యంగా వార్త‌ల‌కు స‌బ్జెక్ట్ అవుతారు.. ఆ కోవ‌లో వైఎస్ సునీత పేరు తెచ్చుకున్నారు.. వివేక హ‌త్యోదంతం అనంత‌రం ఆమె మీడియా వేదిక‌ల్లో స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించారు. త‌న‌కు ఉన్న‌త స్థాయీ ద‌ర్యాప్తు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. కానీ రెండేళ్ల‌లో త‌రువాత పెద్ద‌గా ఆమె మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడే సీబీఐ రెండ్రోజులుగా ఏవో కొన్ని ఆధారాల సేక‌ర‌ణ‌లో వేగం పెంచింద‌ని తెలుస్తోంది.

డాక్ట‌రుగా పేరున్న వైఎస్సార్ .. అంతే స్థాయి డాక్ట‌రుగా పేరున్న త‌మ్ముడి కూతురు సునీత.. ఇలా రాయ‌డంలో ప్ర‌త్యేక‌త క‌న్నా ఆస‌క్తే ఎక్కువ దాగి ఉంది. నాన్న వైఎస్ వివేకా మ‌ర‌ణం అనంత‌రం ఆమె స్పందించారు.. హ‌త్య‌కు సంబంధించి అనుమానాలు ఉన్నాయ‌నీ చెప్పారు.. త‌నకు న్యాయం  చేయాల‌నీ కోరారు.. ఢిల్లీ వీధుల్లో మాట్లాడారు. అయితే ఆమెను రెండు మీడియా సంస్థ లు అదే ప‌నిగా ఈ కేసు విష‌య‌మై విసుగెత్తించిన మాట వాస్త‌వం.. వైఎస్ కుటుంబంలో త‌గాదాల‌ను త‌మ‌కు అనుగుణంగా టీఆ ర్పీ రేటింగుల కోసం అవి ఆమె మాట‌లను వాడుకున్నాయి.. పదే ప‌దే అదే ప‌నిగా ప్ర‌సారం చేశాయి... కానీ త‌రువాత సునీత ద ర్యాప్తు జ‌రుగుతుంద‌నో మ‌రో కార‌ణం చేత‌నో ఆమె నిశ్శ‌బ్దం వ‌హించారు. ఇప్పుడు సీబీఐ ఈ కేసు విష‌య‌మై కాస్త చ‌ల‌నం తీసు కువ‌చ్చింది. ఇప్పుడయినా ఆమె మాట్లాడ‌తారో లేదా అన్న‌ది చూడాలిక.
 

మరింత సమాచారం తెలుసుకోండి: