ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఏం ఎన్నికలబ్బా అనుకుంటున్నారా.. ఇటీవల వైసీపీ సర్కారు పురపాలికల్లోనూ  రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్లను నియమించాలని భావించింది. పార్టీ తరపున ఆశావహులైన నాయకులు ఎక్కువగా ఉండటంతో వారి కోసం వైసీపీ సర్కారు ఈ ఎత్తుగడ వేసింది. ఇప్పుడు అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ నోటిఫికేషన్‌ జారీ చేశారు.


రెండో డిప్యూటీ మేయర్లు,వైస్ ఛైర్ పర్సన్లను నియమించాలన్న వైసీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎస్ ఈసీ నీలం సాహ్నీ ఈ చర్యలు తీసుకున్నారు. 11 మునిసిపల్ కార్పొరేషన్లలో రెండో  డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్ ఈ సీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటితో పాటు 75 మునిసిపాలిటీలు,  నగర పంచాయతీలలో  రెండో వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికకు కూడా ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ జారీ చేశారు.

వీరి ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 30న పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ ఈ సీ ఆదేశించారు. ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులకు ఈ నెల 26 లోపు నోటీసులు అందించాలని ఎస్ ఈ సీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 న ఏలూరు కార్పోరేషన్ లోనూ మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది.


ఏలూరు కార్పోరేషన్ లో మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ ఈ సీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఈ ఎన్నికలతో మరికొందరు వైసీపీ నేతలకు పదవులు వస్తాయి. కానీ.. ఈ కొత్త పదవులు అవసరమా అన్న చర్చ కూడా మొదలైంది. కేవలం తమ పార్టీ నాయకుల కోసమే ఈ కొత్త పదవులు ఏర్పాటు చేశారు తప్ప వీటితో ఒరిగేదేమీ లేదని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: