అవకాశం దొరికినప్పుడల్లా ఇతర దేశాలపై పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ దేశం.. అలాగే త‌మ అంత‌ర్గ‌త విష‌యాల్లో ఏ దేశం వేలు పెట్ట‌నా ఊరుకోదు. ఆ దేశమే చైనా..  భార‌త్‌తో అనేక ఘ‌ర్ష‌ణ జ‌రిగిన అనంత‌రం చైనా అధ్య‌క్ష‌డుడు జిన్‌పింగ్ టిబెట్‌లో ప‌ర్య‌టించాడు. మొదటిసారి అధ్య‌క్ష‌ హోదాలో టిబెట్‌ను సందర్శించాడు. దాదాపు 8 సంవత్సరాల నుంచి చైనా అధ్య‌క్షునిగా ఉన్న జిన్‌పింగ్ ఇంత వ‌ర‌కు టిబెట్ లో ప‌ర్య‌టించ‌లేదు. గ‌తంలో ఆయ‌న టిబెట్‌కు వ‌చ్చాడు కానీ అప్పుడు ఆయ‌న అధ్యక్ష స్థానంలో లేడు. చైనాలో షింజియాంగ్ ప్రాంతం వివాదాస్పదస్ప‌దంగా ఉండేది దాని త‌రువాత చైనాలో మ‌రో వివాదాస్ప‌దంగా టిబెట్ వస్తుండడం విశేషం. అయితే జిన్‌పింగ్ పర్యటన విశేషాలు చైనా అత్యంత గోప్యంగా ఉంచింది. టిబెట్‌లో చైనా అధ్య‌క్షుడు బుధవారం నుంచి పర్యటించారు. కానీ చైనా అధికారిక ఛానల్ సీసీటీవీ శుక్రవారం ఆయన పర్యటనను ప్రసారం చేసింది.

 ఈ పర్యటనలో జిన్‌పింగ్ న‌యాంగ్ వంతెన‌ను ప‌రిశీలించారు. 1990 త‌రువాత చైనా అధ్య‌క్షుడు టిబెట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. ఆయన బుధవారం టిబెట్‌కు చేరుకోగా భ‌ద్ర‌త కట్టుదిట్టం చేశారు. గురువారం జిన్‌పింగ్ అక్క‌డి సిచువాన్‌-టిబెట్ రైల్వే స్టేష‌న్‌ను, సిటీ ప్లానింగ్ మ్యూజియం సంద‌ర్శించారు. అనంత‌రం అక్క‌డి అభివృద్ధిపై అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాడు. గ‌త కొంత కాలంగా టిబెట్ సంస్కృతిని రూపిమాపి చైనా సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టాలని ఆ దేశం ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తోంది.
దీనికి కార‌ణం సంస్కృతిని మార్చ‌డం ద్వారా ఆ భూభాగాన్ని త‌మ గుప్పిట్లో పెట్టుకోవ‌చ్చ‌నే ఆరాటం.

 తమ సంస్కృతి పై వివక్ష చూపుతున్నారని 2011లో టిబెట్ లో అల్లర్లు చెలరేగాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం షింజియాంగ్ లాగా కాకూడదని చైనా ప్రయత్నిస్తోంది. అలాగే విలైనంత త్వ‌ర‌గా అక్కడి ప్రాంత ప్ర‌జ‌ల్లోని అసంతృప్తిని చ‌ల్లార్చి, త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని చైనా భావిస్తోంది. దీనిలో భాగంగానే 146 బిలియన్ డాలర్లను ఖర్చు చేసి భారీ ప్రాజెక్టులను చేపట్టారు. అలాగే ఇత‌ర‌ ప్రాజెక్టు నిర్మాణం లాంటి ప్రణాళికలు చేశారు. ఇవే కాకుండా పలు అభివృద్ధి పథకాలను చైనా మొదలుపెట్టింది. టిబెట్ సరిహద్దు లోనే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ అటు భార‌త్‌లోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, భూటాన్ ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండాల‌ని చైనా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది.

 టిబెట్ వాసుల మాతృభాష‌ను మూల‌న ప‌డేసేందుకు చైనా ప్రయత్నం చేస్తూ వస్తోంది. 2002లో టిబెట్ మాతృభాష‌తో స‌మానంగా మాండ‌రీన్ ను కూడా నేర్చుకోవాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అలాగే ఆదేశాలు కూడా జారీ చేసింది. టిబెట్ మాతృభాష త‌ర‌గ‌తుల‌ను పక్క‌న‌బెట్టి మాండ‌రీన్ త‌ర‌గ‌తుల‌ను భోదిస్తున్న‌ట్టు పోయిన ఏడాది రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది. దీనివల్ల టిబెట్ లో  ఆందోళనలు చెలరేగాయి. ఈ ప్ర‌జా ఉద్య‌మంలో పాల్గొన్న ఓ ఉద్య‌మ‌కారుడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అమెరికా అంత‌ర్గ‌త విభేదాల‌ను ప్రోత్స‌హిస్తుంద‌న్న భ‌యంలో చైనా ఉంది. దీంతో వీలైనంత వేగంగా టిబెట్‌ను త‌మ భూభాగంలో క‌లిపుకునేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది. తాజాగా జిన్‌పింగ్ ప‌ర్య‌ట‌న‌తో చైనా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ టిబెట్‌ను వేగ‌వంతం చేయ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: