టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు... అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కల్వకుంట్ల తారక రామారావు మంచి క్రేజ్ ఉంది. కేటీఆర్ కు అటు ప్రజల్లో అలాగే తెలంగాణ యువత మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొదట్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు గానే పరిచయమైన కేటీఆర్.... ఆ తర్వాత ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్న ఉన్నారు. గల్లీల్లో తెలంగాణ యాస లో మరియు ఇంటర్నేషనల్ వేదికల్లో ఇంగ్లీష్ భాషలో మాట్లాడే ప్రతిభ ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్. అంతేకాదు ప్రతిపక్ష నాయకులు, జాతీయ నాయకుల తో కూడా శభాష్ అనిపించుకున్నారు మంత్రి కేటీఆర్. వాస్తవానికి తెలంగాణాలో భారీ స్థాయి పెట్టుబడులు మరియు ఐటీ రంగం ఎన్నడూ లేని విధంగా దూసుకు పోతున్నది అంటే దానికి అసలు మూలం మంత్రి కేటీఆర్. తనదైన చాతుర్యంతో వివిధ కంపెనీల మహా నగరమైన హైదరాబాదుకు తీసుకు రావడంలో సఫలీకృతం అవుతున్నాడు. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్.... "అన్న ఆపద అంటే నేనున్నా "అంటూ ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది వలస కార్మికులు మరియు ఇతర ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నాడు మంత్రి కేటీఆర్.

జననం విద్యాభ్యాసం

మంత్రి కేటీఆర్ 1976 జూలై 26న సిద్దిపేట జిల్లాలో జన్మించారు. ఇక తన పాఠశాల విద్యను హైదరాబాదులోని... సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పూర్తి చేయగా... నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా లో ఎంబీఏ పూర్తి చేశారు. ఇక అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం చేశారు మంత్రి కేటీఆర్.

రాజకీయ ప్రస్థానం
2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. అయితే ఈ పోటీలో సమీప ప్రత్యర్థి అయిన కె.కె.మహేందర్రెడ్డి పై కేవలం 171 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ గెలుపొందారు. దీంతో 2009 లో మొట్టమొదటి సారిగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక తరువాత... సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగు లేని నాయకుడిగా ఎదిగారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు కేటీఆర్. తొలిసారిగా నే కీలకమైన ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2018 లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో..  మరోసారి కేటీఆర్ మంత్రి అయ్యారు.  ఇది ఇలా ఇలా ఉండగా.. బర్త్ డే జరుపుకుంటున్న కేటీఆర్ గారికి హెరాల్డ్ తరఫున.. మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: