బ‌ర్త్ డే స్పెషల్ : యువ రాజు ఎలా ఉన్నాడు

కొన్ని పుట్టిన రోజులు ప్ర‌త్యేకం

కొన్ని రోజులు ప్రత్యేకం

కొన్ని  ప‌నులు ప్ర‌త్యేకం

ప్ర‌త్యేకం లాంటివి కొన్ని కాక‌పోయినా

కొన్ని మాత్రం అసాధారణం

అయి ఉంటాయి..

లేదా అసాధార‌ణ ఆలోచ‌న‌కు అవి ఉప‌యోగ‌ప‌డ్తాయి

మీరు బొకేలు తేవొద్దు పండ్లూ పూలూ కాదు

కావాల్సింది ఈ పుట్టిన రోజు పండుగకు కావాల్సింది

కాస్త ప్ర‌త్యేక‌త అది సాయంతోనే సాధ్యం

నేను వికలాంగుల‌కు 100 మోటార్ ఆధారిత ట్రై సైకిళ్లు

ఇస్తా మీరూ ఇవ్వండి .. అలానే మొక్క‌లు నాటండి

ఇవి చేయండి చాలు ఇంకేం వ‌ద్దని చెప్పారాయ‌న


రాజు ఎలా ఉన్నాడు

తెలంగాణ వాకిట రాజు ఎలా ఉన్నాడు

అన్న‌ది చాలా కీల‌కం

పోనీ.. ఆయ‌న‌ను అనుస‌రించే

యువ రాజు ఎలా ఉన్నాడు


య‌థా ప్ర‌జా త‌థా రాజా

అన్న‌ట్లు ఉన్నాడా

లేదా య‌థా రాజా త‌థా ప్ర‌జ

అన్న విధంగా ఉన్నాడా

ఇదీ ఇవాళ్టి ప్ర‌శ్న


పుట్టిన్రోజు అంటే చెప్పానుగా ఒక‌రికి చెల్లించే

కృత‌జ్ఞ‌త.. ఈ పుట్టిన రోజున కేటీఆర్ ఎవ‌రికి

కృతజ్ఞ‌త‌లు చెల్లిస్తారు..ఇది కూడా ఆస‌క్తిదాయ‌కం అయిన ప్ర‌శ్నే..



సామాజిక బాధ్య‌త‌తో నాయ‌కులు ప‌నిచేయాలి.. సామాజిక బాధ్య‌త‌ను భుజానేసుకుని ప‌నిచేయాలి అని రాయండి అన్నారొక‌రు.కేటీఆర్ అనే యువ రాజు ఆ ప‌నే చేస్తున్నారా?అవున‌న్న‌దే స‌మాధానం.. కేటీఆర్ .. నాన్న పేరుకు కీర్తికి కొన‌సాగింపు అని న‌మ్ముతున్నారా జ‌నం.. అంటే అవున‌న్న‌దే స‌మాధానం.. మ‌రి! రాష్ట్ర రాజ‌కీయాల్లో విభేదాలు లేవా? లేవు ఉన్నా అవి కూడా మీడియా చెప్పేవే.. లేదా మ‌ల్లన్న లాంటి కొంద‌రు మాత్రమే ప్ర‌చారం చేసే వార్త‌లు ..


క‌రోనా వేళ

కేసీఆర్

నాన్న ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు

కొడుకు అందుకు కొన‌సాగింపు అయ్యారు


ఎక్క‌డో ఎవ్వ‌రో చిక్కుకు పోయారంటే లాక్డౌన్ లో స్పందించారు.. ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌న‌లానే  స్పందించిన వారంద‌రి నీ అభినందించారు. తెలంగాణ వాకిట సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఫిల్మ్ ఫేం సోనూ సూద్ ను ఆఫీసుకు పిలిచి మ‌రీ! అభినందిం చారు. ఇంకా .. ఆప‌ద కాలంలో ఎక్క‌డ ఎవ్వ‌రు ట్విట‌ర్ వేదిక‌గా ఏం అడిగినా తోచిన రీతిన త‌న‌వంతు సాయం చేశారు.. కొన్ని న‌వ్వులు కూడా త‌న ట్వీట్ల‌తోనే పంచారు.  ముఖ్యంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయ‌డ‌మే త‌న ముందరి ల‌క్ష్య‌మ‌ని ప‌దే ప‌దే చెప్పారు. అదే నిరూపిస్తున్నారు కూడా.. రాజ్యంలో మ‌రో సామంత రాజ్యం ఎందుకు?  ఇలా అంటే న‌వ్వేస్తారేమో.,. కొంద‌రే ప‌ని గ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తారు. ఆయ‌న వాటికి న‌వ్వుతోనూ కొన్ని మంచి ప‌నుల‌తోనూ స‌మాధానం చెప్తారు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అను నేను ఇలాంటి సామాజిక నేప‌థ్యం ఉన్న సినిమాలు వ‌స్తే ఆనందిస్తారు. ముఖ్యంగా తెలంగాణ వాకిట సంస్కృతి ని మోసుకుపోయే మాధ్య‌మాల‌ను ఇష్ట‌ప‌డ‌తారు.. వాటిపై స‌న్నిహిత వ‌ర్గాల‌తో చ‌ర్చిస్తారు. మ‌ల్లేశం లాంటి సినిమాలు వ‌స్తే ట్విట‌ర్ వేదిక‌గా స్పందించ‌డ‌మే కాదు వాటికో వెన్నుద‌న్ను ఇస్తారు. అంతా అనుకున్న విధంగా అయితే కాదు ఇప్పుడు కేటీఆర్ స‌మాంత‌ర ప్ర‌భుత్వం కాదు.. ప్ర‌భుత్వాన్ని న‌డిపే శ‌క్తికి ఓ సాయం అంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: