40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎదుర్కోంటోన్న‌ దుర్భరమైన పరిస్థితి చ‌రిత్ర‌లో ఎప్పుడు ఎదుర్కొని ఉండ‌రు. తన రాజకీయ వారసుడు లోకేష్ పార్టీ నిలబెడతాడు అన్న‌ నమ్మకాలు పార్టీలోనే చాలామంది నేతలకు లేవు. చంద్రబాబు ఇప్పటికే అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నారు అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాలం చెల్లి ప్రజలకు దూరంగా ఉంటున్న సీనియర్ ల మాటలు విని.. ఇంకా వారినే నమ్ముతూ యువ నేత‌ల‌ను పక్కన పెడుతున్నారు. అందుకే చంద్రబాబు ఈ తరం జనరేషన్ యువతకు దూరం అవుతోన్నార‌న్న‌ చర్చలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి యువత ఆయనకు ఓటు వేయకపోవడం కూడా ప్రధాన కారణం.

పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కూడా చంద్రబాబు ఇంకా పాత పంథాలోనే ముందుకు వెళుతున్నారని సొంత పార్టీ నేతలే చెపుతున్నారు. గత ఎన్నికల తర్వాత ఏపీ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్చార్జులు లేకుండా పోయారు. ఇప్పుడిప్పుడే ఒక్కో నియోజకవర్గంలో ఇన్ చార్జ్ ను సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో నిజాయితీగా పని చేసిన నేతల‌ నివేదికలను కూడా బాబు తెప్పించుకుంటున్నారు. వీరితో పాటు లోకేష్ నాయకత్వాన్ని సమర్ధించే యువ నేతలకు కూడా వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే 88 సీట్లు రావాలి.

ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ప‌నితీరు, టీడీపీ నేత‌ల స‌మ‌ర్థ నాయ‌క‌త్వం ఇవ‌న్నీ లెక్కుల వేసుకుంటోన్న చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా ఓ 75 సీట్ల‌లో విజ‌యం సాధిస్తామ‌ని భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే పార్టీ అధికారంలోకి రావాలంటే మ‌రో 13 సీట్ల‌లో విజ‌యం సాధించాలి. 75 సీట్లు గెలిచినా.. మ‌రో 20 సీట్ల‌లో ఎలా గెల‌వాలి.. అక్క‌డ ఎలా బ‌ల‌మైన నేత‌ల‌ను సెట్ చేయాల‌న్న దానిపై బాబు గ‌ట్టి క‌స‌ర‌త్తులే చేస్తున్నార‌ట‌. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: