కరోనా వైరస్ కారణంగా విద్యా రంగం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. సాఫీగా సాగిపోతున్న విద్యార్థుల భవిష్యత్తు కాస్త అయోమయంలో పడిపోయింది. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉన్నత చదువులు చదవాలి అనుకున్న విద్యార్థులందరికీ అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది.  కరోనా వైరస్ కారణంగా మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో తేరుచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు పాఠశాలను తెరవాలని ధైర్యం చేసినప్పటికీ మళ్లీ కరోనా వైరస్ దూసుకువస్తు వెనకడుగు వేసే పరిస్థితి తీసుకు వస్తుంది.



 దీంతో పాఠశాలలో  పిల్లలు కాలేజీ లోనే విద్యార్థులు అటు విద్యాసంస్థల  ముఖం చూడక  రోజులు గడిచి పోతుంది. దీంతో తాము చదువుకునే విద్యార్థులం అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు ఎంతోమంది. అయితే కరోనా వైరస్ కారణంగా కనీసం అటు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా లేదు అన్న విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. ఇటీవలే ఏపీలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో చివరికి పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ ప్రమోట్ చేసేందుకు నిర్ణయించింది.



 ఈ క్రమంలోనే ప్రతి సబ్జెక్టుకు పాస్ మార్కులు అయినా 35 మార్కులు కేటాయిస్తూ ప్రతి ఒక్క విద్యార్థినీ ప్రమోట్ చేస్తూ  అంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం కేవలం 35 మార్కులు మాత్రమే కేటాయించడం పై అటు విద్యార్థులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఒకవేళ విద్యార్థులు ఎక్కువ మార్కులు కావాలి అనుకుంటే తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందే అంటూ చెప్పింది. దీని కోసం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ ఫలితాలపై అసంతృప్తితో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా పరీక్షలు రాసి తమ ప్రతిభను చాటుకునేందుకు అవకాశం ఉంది అని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: