ప్రస్తుతం విశాఖలోని ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కొనసాగుతుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది.  కొన్ని రోజుల నుంచి నష్టాల్లో కూరుకుపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ఇక ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యాము అంటూ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్రం ప్రకటన కాస్త అటు ఏపీ వాసులందరికీ ఊహించని షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. అయితే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తాము అంటూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు మొదలయ్యాయి.


 ప్రస్తుతం ఎన్నో ఉద్యోగ సంఘాలు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ కూడా గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతుంది. కేంద్రం  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు తమ నిరసనలు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది.  అదే సమయంలో అధికార పక్షానికి చెందిన నేతలు ప్రతిపక్షానికి చెందిన నేతలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోము అంటూ హెచ్చరిస్తున్నారు.



 ఇటీవలే టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జరుగుతున్న నిరసనలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే టిడిపి నేతలు అందరూ కూడా రాజీనామాలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నాము అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2000 సంవత్సరంలో నాలుగు వేల కోట్లు ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే.. తన విజ్ఞప్తి తో ఏకంగా స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి చేసేందుకు 1333 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది అని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పై సీఎం జగన్ మౌనం వీడాలని.. పరిరక్షణకు నేతృత్వం వహించాలని అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: