మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఆయన సొంత నియోజకవర్గం అయినా హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికి విధితమే. దీంతో హుజురాబాద్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎలాగైనా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు గులాబీ బాస్,  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ రచనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు కు హుజురాబాద్ ప్రచార బాధ్యతలు అప్పగించిన కేసీఆర్... రోజుకు వ్యూహాన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక గా మారుస్తున్నారు. దీంతో ఈటెల రాజేందర్ శిబిరంలో కలవరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈటల రాజేందర్ పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. 

ఈటెల ఒక్క అడుగు వేస్తే... గులాబీ బాస్ నాలుగడుగులు ముందే వేస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక.... రసవత్తరంగా మారుతోంది. ఇక ఇప్పటికే దళిత బందు పేరుతో కొత్త స్కెచ్ వేశారు సీఎం కేసీఆర్. ఈ పథకం ద్వారా దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలన్నది కెసిఆర్ ఆలోచన. అంతేకాదు ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ నుంచి మొదలు పెట్టడం కొసమెరుపు. దళిత బంధు పథకాన్ని కెసిఆర్ తీసుకురావడంతో అటు బిజెపి పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బండా శ్రీనివాస్ నియామకం చేశారు గులాబీ బాస్ కెసిఆర్.

ఈ మేరకు నిన్న అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. అదేంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి హుజురాబాద్ ఎన్నికలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అవును హుజురాబాద్ ఉప ఎన్నికలకు ఈ పదవికి సంబంధం ఉంది. అదేంటంటే బండారి శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత. అలాగే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు కూడా. ఈ నేపథ్యంలోనే బండ శ్రీనివాసులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ పదవి ద్వారా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. దీని కారణంగానే సీఎం కేసీఆర్ కి నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: