ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.  ఈ క్రమంలోనే మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ అనే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.  ఇక దిశ చట్టం ద్వారా ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడినవారికి ఏకంగా శిక్ష విధించేందుకు దిశ చట్టం తీసుకువచ్చింది. ఇటీవలే దిశ చట్టాన్ని మహిళలందరికీ మరింత చేరువ చేసేందుకు దిశ అనే ఒక ప్రత్యేకమైన యాప్ ని కూడా రూపొందించింది ఏపీ ప్రభుత్వం.


 ఇక దిశ అనే యాప్ ద్వారా మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి అనే దానిపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇలా దిశా యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే కేవలం నిమిషాల వ్యవధిలోనే మహిళను రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము అంటూ పోలీసులు కూడా తెలిపారు  అయితే పోలీసులు ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉంటారు ఫిర్యాదు చేసిన గంటలు అయినా కూడా ఎప్పుడూ స్పందించరు అన్న విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇటీవల దిశ యాప్ ద్వారా  పోలీసులు ఒక విద్యార్థిని రక్షించారు . ఏకంగా సూపర్ హీరోల కంటే ఫాస్ట్గా వచ్చేశారు పోలీసులు.



 ఇటీవలే విజయవాడలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. తాను ప్రమాదంలో ఉన్నాను అంటూ చెప్పింది.  దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే విద్యార్థులను రక్షించారు. దేవి నగర్ కు చెందిన ఓ విద్యార్థిని టీజింగ్ చేస్తూ ఓ యువకుడు వేధిస్తున్నాడు. ఆ యువకుడి వేధింపులు తట్టుకోలేక తండ్రికి, కాలేజీ ప్రిన్సిపాల్ కి కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే వారు యువకుడిని హెచ్చరించారు. అయితే అతని తీరు లో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవలే మరోసారి ఆ యువకుడు ఆ యువతి వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే దిశ యాప్ sos బటన్  నొక్కింది  వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆరు నిమిషాల్లో ఆ యువతి ఉన్న ప్లేస్ కి వెళ్లి నిందితుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: