ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మూడో వేవ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే మ‌న దేశంలో కూడా ఆగ‌స్టు చివ‌ర‌లో థ‌ర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఇక ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఐసీఎంఆర్ కూడా మూడో వేవ్ విష‌యంలో భార‌త‌దేశం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రికలు జారీ చేసింది. అయితే ఇందుకు ప‌రిష్కారంగా మ‌న దేశ ఆరోగ్య నిపుణులు కొన్ని సంపుల్ చిట్కాలు చెపుతున్నారు. వీటిని పాటించ‌డం ద్వారా క‌రోనా నుంచి మ‌న‌ల‌ను మ‌నం ర‌క్షించుకోవ‌చ్చ‌ని వారు చెపుతున్నారు.

అయితే ఇవి గ‌తంలోనే వైర‌ల్ అవ్వ‌గా.. మూడో వేవ్ నేప‌థ్యంలో మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఉప‌వాసాలు, ఇత‌ర నియ‌మాల పేరుతో క‌డుపుల‌ను ఖాళీగా ఉంచ‌వ‌ద్ద‌ని చెపుతున్నారు. సెకండ్ వేవ్‌లో చ‌నిపోయిన వారిలో ఎక్కువ మంది డి విటమిన్ లోపం వ‌ల్లే చెపుతున్నారు. అందుకే డీ విట‌మిన్ లోపం స‌రి చేసుకునేందుకు ప్ర‌తి రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించాలి. ఇక ఎవ్వ‌రూ కూడా ఏసీని వాడ‌వ‌ద్ద‌నే చెపుతున్నారు. ఏసీ క‌రోనాకు మ‌రింత స్పేస్ ఇచ్చే వాటిల్లో ఒక‌టి.

ఇక ప్ర‌తి రోజూ వెచ్చని నీరు త్రాగుతూ... గొంతు తడిగా ఉంచాలి.  ముక్కుకు  ఆవ నూనె రాయ‌డం... ఇంట్లో హారతి కర్పూరం కాల్చడం, కూర‌ల‌ను అల్లం పొడితో క‌డ‌గ‌డం, దాల్చిన చెక్క వాడ‌డం,  రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగ‌డం చేయాలి. ప్ర‌తి రోజు ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయాలి. ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగ‌డంతో పాటు పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినాల‌ని చెపుతున్నారు. ఇక పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంద‌ని చెపుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా పాల‌లో పసుపు వేసుకుని తాగితే మంచిది. ఇక పై నియ‌మాల‌తో చాలా వ‌ర‌కు క‌రోనాను త‌రిమి వేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇవి పాటిస్తే క‌నీసం రోగ నిరోధ‌క శ‌క్తి అయినా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: