ఈ అనంత విశ్వంలో అద్భుతాలకు కొద‌వ లేదు.. అలాగే ఎన్నోన్నో ర‌హ‌స్యాలు త‌న క‌డుపులో దాచుకుంది. అలాంటి ఖ‌గోళ అద్భుతాలకు లెక్కే లేదు. ఈ రోజు, రేపు (జులై 24, 25) న ఆకాశంలో మ‌రో ఖ‌గోళ అద్భుతం జ‌ర‌గ‌నుంది. ఈ రోజు చంద్రుడు శ‌నిగ్ర‌హానికి అత్యంత ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌నున్న‌ట్టు, రేపు గురుగ్ర‌హానికి ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌నున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

    అంతే కాకుండా.. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒక సరైన రేఖలోకి వస్తాయని ఖగోళ నిపుణులు వెల్ల‌డించారు.  చంద్ర గ్ర‌హం 5 డిగ్రీల కోణంలో కాస్త ప‌క్క‌కి ఉండడం వల్ల సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడి మీద‌ పడుతుంది. దీంతో ఈ సమయంలో చంద్రుడు చాలా కాంతివంతంగా ప్ర‌కాశిస్తాడు. ఈ ర‌క‌మైన ప్ర‌క్రియ‌లో చంద్రుడిని బక్ మూన్ లేదా థండర్ మూన్ అని పిలువ‌బ‌డుత‌య‌ని ఖగోళ శాస్త్రవేత్తలు వివ‌రిస్తున్నారు.

 అయితే, జూలై పౌర్ణమి రోజు వచ్చే కాంతివంతమైన చంద్రుడిని బక్ మూన్ లేదా థండ‌ర్ మూన్‌ అని పిలవవచ్చు. ఈ స‌మ‌యంలో మగ జింకల కొమ్ములు ఎక్కువ‌గా పెరుగుతాయని చెబుతుంటారు. ఈ పేరును అల్గాన్ క్విన్ తెగ వారు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ బ‌క్ మూన్ స‌మ‌యంలో మ‌గ జింక‌ల‌కు పాత కొమ్ములు విరిగిపోయి కొత్తవి వస్తుంటాయట. మగ బక్ డీర్స్ తమ కొమ్ములను జూలై సమయంలోనే  ఎక్కువ‌గా పెంచుకుంటాయ‌ట‌..  


అంతే గాక ఈ సమయంలో ఎక్కువగా పిడుగులు, ఉరుములు కూడా పడుతుంటాయి. కాబ‌ట్టే దీనిని థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ థండ‌ర్ స‌మ‌యంలో చందమామ రంగు కూడా తెల్లగా కాకుండా కాస్త ఎరుపు, నారింజ రంగుల కలయికలో ఉంటుంది.  

ఈ రోజు అంటే 24న చంద్ర గ్ర‌హం నాలుగు డిగ్రీల పాటు పక్కకు జ‌రుగుతాడ‌ట‌.. దీంతో చంద్రుడు శని గ్రహానికి దగ్గరగా వెళ్తాడు. ఈ రోజు రాత్రి చంద్రుడు, శని గ్రహం రెండు కూడా పక్కపక్కనే ఆకాశంలో మనకు కనిపిస్తాయి. 25న అంటే రేపు మరో నాలుగు డిగ్రీల పాటు జరిగి గురుగ్రహానికి చంద్రుడు దగ్గరవుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా సోమవారం తెల్లవారు జాము సమయంలో పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. ఈ ప్ర‌క్రియ‌ను నేరుగా లేదా బైనాక్యులర్స్ సాయంతో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ బౌగోళిక దృశ్యం ఆకాశంలో వింత‌గా క‌నిపిస్తుంద‌ని, ఈ బ‌క్ మూన్‌ను చూడ‌డానికి ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: