హుజూరా బాద్ లో సీన్ రివ‌ర్స్ - కేసీఆర్ కు వ‌ణుకు ?
అవునో కాదో అన్న‌ది తెలియ‌దు కానీ
సీన్ ఇలానే ఉంది అని కొంద‌రి మాట


ఏం లేద‌న్న కేసీఆర్ కు ఈ ఎన్నిక‌లు కీల‌కం..
ఏం కాద‌న్న త‌నకూ టీఆర్ ఎస్ కూ ఈ ఎన్నిక‌ల‌తోనే భ‌విష్య‌త్


ఉద్య‌మ స‌హ‌చ‌రుడు ఈటెల పార్టీ వీడిపోయి త‌న‌దైన పంథాలో
కేసీఆర్ ను ఇర‌కాటంలోనెడుతున్నార‌ని కొంద‌రు పొలిటీషియ‌న్లు
వ్యాఖ్య‌లు చేస్తున్నారు.



ఈ నేప‌థ్యంలో ఈటెల గెలిస్తే నేరుగా అయోధ్య‌కు వెళ్తామ‌ని, అలానే హుజూరాబాద్ సెంట‌ర్లో అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేస్తామ‌ని
ఇలా ఎన్నో మాట‌లు బాణాల్లా సంధిస్తున్నారు. ఒక‌ప్పుడు ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ ఇంతే వేగంతో ఉండేవార‌ని, ఇప్పుడు ఆయ‌న స్థానంలో సంజ‌య్ తో స‌హా ఇంకొన్ని పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ చేరి ఇలా మాట్లాడిస్తున్నాయని ప‌రిశీల‌కులు అంటున్నారు. కేసీఆర్ కూడా స‌ర్వేల‌ను న‌మ్ముకుంటున్నార‌ని  అందుకే హుజూరాబాద్ లో కీల‌క నేత‌ల‌కు ప‌ద‌వుల ఎర వేస్తున్నార‌ని ఇందుకు శాప్ చైర్మ‌న్ ప‌ద‌విని బండా శ్రీ‌నివాస్ కు ఇవ్వ‌డ‌మే ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు కొంద‌రు బీజేపీ నేత‌లు.. రేవంత్ రెడ్డి క‌న్నా సంజ‌య్ జోరే ఎక్కువ‌గా ఉన్న ఈ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ గెలిస్తే బీజేపీకి మ‌రింత మైలేజ్ వ‌చ్చిఇంకాస్త రాష్ట్రంలో కుదుట ప‌డుతుంద‌ని ఈటెల వ‌ర్గం పేర్కొంటుంది. ఈటెల కూడా కేసీఆర్ పై ఉన్న కోపం అంతా వ్యాఖ్య‌ల్లో చూపించ‌క‌పోవ‌డంతో ఆ బాధ్య‌తేదో సంజ‌య్  తీసుకుంటున్నార‌ని కొంద‌రు ప‌రిశీల‌కులు అంటున్నారు.. ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాలు
కేసీఆర్ కు ఈ సారి క‌ష్ట‌మేన‌ని చెబుతున్నాయ‌ని అందుకే అస‌లు సాధ్యా సాధ్యాలు ఆలోచించ‌కుండా ప‌న్నెండు వేల కోట్ల రూపాయ‌ల‌తో ద‌ళిత బంధు ప‌థ‌కం అనౌన్స్ చేశార‌ని ఇది ఓ విధంగా ఈటెల విజ‌యం అని బీజేపీ అనుకూల వ‌ర్గం చెబుతోంది..




బండి సంజ‌య్ మాట‌ల తీవ్ర‌త మ‌ళ్లీ పెంచారు.. ఎప్ప‌టిలానే కేసీఆర్ స్ట్రాట‌జీలోనే మాటలు విసురుతున్నారు. కేసీఆర్ కేవ‌లం స‌ర్వేల‌ను న‌మ్ముకుని ఉన్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈటెల‌ను ఓడించేందుకు బీజేపీనీ ఢీ కొనేందుకు కేసీఆర్ కు ఉన్న వ్యూహాల‌లో భాగంగానే ద‌ళిత బంధు ప‌థ‌కం ఒక‌టి తెర‌పైకి తెచ్చార‌ని ప‌రిశీల‌కు అంటున్నారు. కానీ టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో ఆశించిన ఫ‌లితం రాద‌నే చెబుతున్నాయి కొన్ని నిఘా వ‌ర్గాలు. దీంతో బీజేపీ త‌న త‌ర‌ఫున జోష్ పెంచింది. ఎంపీ సంజయ్ .. ఈటెల క‌న్నా దూకుడుతో ఉన్నారు.. ముఖ్యంగా విచ‌క్ష‌ణ అన్న‌ది లేకుండా మాట్లాడి పీపుల్ అటెన్ష‌న్ పొందాల‌ని చూస్తున్నారు.. అని కొంద‌రు ఎన‌లిస్టులు అంటున్నారు. కేసీఆర్ మంత్రుల‌పైనా ఆయ‌న చాలా అవ‌మాన‌క‌ర ధోర‌ణిలో మాట్లాడారు అని ఇదెంత మాత్రం సబ‌బు కాద‌ని వాళ్లు మ‌త్తు ప‌దార్థాలు తీసుకుంటారని అలాంటి వారు ఈటెల‌ను ఎలా ఓడిస్తార‌ని సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్ ను ఎక్క‌డికో తీసుకు వెళ్లాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: