ష‌ర్మిల‌క్క కు థాంక్స్ ?

ఇవాళ కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వైఎస్సార్టీపీ అధినేత్రి  ష‌ర్మిల స్పందించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని పేర్కొంటూ ఈ  పోస్టును ఉంచారు. ఇటీవ‌ల పార్టీ ఏర్పాటు చేశాక తొలి ప్రెస్ మీట్ నిర్వ‌హించిన ష‌ర్మిల కేటీఆర్ ఎవ‌రు అంటూ విలేక‌రుల‌ను ఎదురు ప్ర‌శ్నించారు. ఈ వ్యాఖ్య పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప‌లువురు టీఆర్ఎస్ శ్రేణులు ష‌ర్మిల‌ను టార్గెట్ చేసుకుని ప‌లు పోస్టులు ఉంచారు. ఈ త‌గ‌వుకు తెర దించేలా ఈ రోజు షర్మిల త‌న‌దైన శైలిలోనే కేటీఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.


ఆ రోజు కేటీఆర్ త‌న పార్టీ ఆరంభం సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు దృష్టిలో ఉంచుకునే విలేక‌రుల స‌మావేశంలో అలా స్పందించి ఉంటార‌ని ష‌ర్మిల వ‌ర్గాల వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చాలా రోజుల వ‌ర‌కూ ఇదే విష‌య‌మై ట్రోలింగ్స్ న‌డిచాయి.వివాదాల‌కు చెక్ పెట్టేందుకు ష‌ర్మిల త‌ర‌ఫున ఒక్క‌టంటే ఒక్క మీడియా నోట్ కూడా విడుద‌ల కాలేదు. కేటీఆర్ ఫ్యాన్స్ కు వైఎస్సా ర్టీపీ వ‌ర్గాల‌కు సోష‌ల్ మీడియాల్లో పెద్ద ర‌చ్చ‌నే జ‌రిగింది. ఏమ‌యిన‌ప్ప‌టికీ ఇప్పుడీ పోస్టు కాస్త‌యినా కేటీఆర్ ఫ్యాన్స్ ను మెప్పిస్తుందో లేదో చూడాలి..ఇందులో కూడా ఆమె కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ ని పేర్కొన‌డం విశేషం. ఏదేమైన‌ప్ప‌టికీవైఎస్ ష‌ర్మిల త‌ర‌ఫున గ‌తంలో న‌డిచిన వివాదానికి  వివ‌ర‌ణ లేకున్నా ఈ కొద్ది పాటి మార్పూ ఆహ్వానించ‌దగ్గ‌దే అని ప‌రిశీల‌కులు అంటున్నారు. రాజ‌కీయంలో చిర కాల శ‌త్రుత్వం ఉండ‌దు కానీ శ‌త్రువు అని పేరు ఒత్తి ప‌లికి మ‌రీ ప్రెస్ మీట్లు నిర్వ‌హించ‌డ‌మే మ‌రీ! విడ్డూరం. ఆ ప‌ని పార్టీ ఆరంభంలోనే ష‌ర్మిల చేయ‌డ‌మే ఇంత‌టి ర‌చ్చ‌కు కార‌ణం.. ఆమె కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను మ‌రీ అంత సీరియ‌స్ గా తీసుకోకుంటే ఇంత‌టి వాగ్వాదం న‌డిచేదే కాదు. అంతా మా శ‌త్రువులే  చెప్ప‌డం తోనే ఆమె ప్ర‌థ‌మ శత్రువుగా అంద‌రికీ  మారిపోయారు..అలా కాకుండా తానేం చేస్తానో ఆ రోజు చెప్పి అక్క‌డికి ప‌రిమితం అయి ఉంటే స‌రిపోయేది...అన్న‌ది కొంద‌రి భావ‌న..

మరింత సమాచారం తెలుసుకోండి: