దివంగత రాజకీయ నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసుడిగా, ఆయన అడుగు జాడల్లో నడిచే కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికీ నేనున్నానంటూ, తన తండ్రి లాగే పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయి, వారికి ఏమి ఇస్తే సంతోషంగా ఉంటారో వాటినే ఎన్నికల మానిఫెస్టోలో చేర్చి, కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాడు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రజల మనస్సులో చెరగని ముద్రను వేసుకున్నాడు. ఇక్కడి వరకు బాగుంది. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అవుతోంది ? ఎన్నో అంచనాలతో సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. ఒక్క అవకాశం అనే నినాదంతో ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు. సంక్షేమం వరకు పర్వాలేదు. కానీ రాష్ట్రానికి సంబంధించి మిగిలిన విషయాలలో జగన్ పై కోకొల్లలుగా విమర్శలు వస్తున్నాయి. ఇది అనుభవ లేమి కావొచ్చు ? లేదా తన పక్కన ఉన్న వారే కారణం కావొచ్చు ? లేదా వేరే ఇతర కారణాలు కూడా కావొచ్చు ?
అయితే జగన్ పనితీరుపై ప్రజలు ఎంతమాత్రం సంతృప్తిగా ఉన్నారో తెలియాలంటే ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే చాలు. జగన్ కి గాలి వాటంగా అధికారం వచ్చిందా ? లేదా జగన్ పై నమ్మకంతో ప్రజలు గెలిపించారా అన్నది తెలుస్తుంది. కానీ అంతకు ముందే, రాబోయే ఎన్నికల్లో ఎవరికి అనుకూలం అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు ప్రారంభించారు. వీరు అంటున్న ప్రకారం వైసీపీ సోషల్ మీడియా లేదా ప్రింట్ మీడియా లను ఉపయోగించుకోవడంలో మిగతా పార్టీలతో పోలిస్తే చాలా బలహీనమని తేల్చేస్తున్నారు.  మిగతా పార్టీల వారు వాడుకున్నంతగా వైసీపీ మీడియాను వాడుకోవడం లేదు. కేవలం ఒక్క సాక్షి ఛానల్ అది కూడా ప్రింట్ మీడియా లేదా వార్తా ఛానెళ్లతో పని అవుతుందా అంటే కష్టమే ? ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా లేదా టీవీ ఛానెళ్ల కన్నా అత్యంత ప్రభావవంతంగా సోషల్ మీడియా పనిచేస్తోంది. ఏది జరిగినా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

 ఈ విషయంలో టీడీపీ ముందుంది. వారి పార్టీకి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా, ర్యాలీ జరిగినా, డిబేట్ జరిగినా, నిరసన కార్యక్రమాలు జరిగినా వెంటనే లైవ్ ఇస్తాయి. దీని ద్వారానే ఈజీగా పార్టీ గురించి ప్రజలకు వేగంగా తెలుస్తుంది. అది మంచి అయినా, చెడు అయినా వంద సార్లు చెబితే ప్రజలు నమ్మేస్తారు, అదే మన దౌర్భాగ్యం. కానీ వైసీపీ సోషల్ మీడియా చాలా స్లో, లైవ్ మీటింగ్ ఏదైనా స్టార్ట్ అయితే, చాలా సేపటికి గానీ సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ రాదు. ఇది కాకుండా వైసీపీ నాయకులు కానీ, లేదా ఎమ్మెల్యే లు కానీ మీడియాతో తక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. అదే టీడీపీని చూడండి సగానికి పైగా ఛానెళ్ల యాజమాన్యాలు టీడీపీ చంద్రబాబు నాయుడు తో సన్నిహతంగా ఉంటారు. అలాంటప్పుడు ఒక్క వార్తయినా చంద్రబాబుకు వ్యతిరేకంగా రాయగలరా ? ఈ విషయంలో జగన్ మరియు వైసీపీ డెవలప్ కావలసిన అవసరం ఉంది.
 ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోవాలంటే, మీడియాది అతి ముఖ్యమైన పాత్రని గుర్తుంచుకోండి. కాబట్టి మీడియా మరియు సోషల్ మీడియాలను వాడుకోవడంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా కొనసాగితే వైసీపీ ఎన్ని మంచి పనులు చేసినా, ప్రజల కోసం త్యాగాలు చేసినా వారికి తెలియనప్పుడు, అంతా వృధానే అవుతుంది. ప్రచారం అనేది చాలా ప్రధానం. ఏ ఎన్నికల్లో అయినా ఇది కీలక పాత్ర వహిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: