హుజురాబాద్‌ నియోజక వర్గం ఉప ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాకముందే... హుజురాబాద్‌ నియోజక వర్గంలో గెలుపు కోసం అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాయి. ఇక ఈ నేపథ్యంలోనే.... గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా తన వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైనా... మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ను ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రి హరీష్‌ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు గులాబీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు. అటు తెలంగాణ మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇతర పార్టీల నేతలకు కూడా ఎర వేస్తోంది టీఆర్‌ఎస్‌ పార్టీ. దీంతో హుజురాబాద్‌ ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.   హుజురాబాద్ ఉప ఎన్నిక పై ముఖ్యమంత్రి కేసీఆర్ఆడియో టేపులో మాట్లాడారు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంట తనగుల ఎంపీటీసీకీ ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

 దళితబంధు పథకం నేపథ్యంలో ఫోన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రస్తావించారు. దళిత బంధు గురించి అన్ని గ్రామాలకు తెలపాలన్న సీఎం కేసీఆర్... ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ పై సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ చాలా చిన్నోడని పేర్కొన్న తెలంగాణ  సీఎం కేసీఆర్...అసలు ఈటెల రాజేందర్ తో అయ్యేది కాదు- పోయేది కాదని ఎద్దేవా చేశారు.  ఈటెల రాజేందర్ ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తీసిపారేశారు సీఎం కేసీఆర్.  ఇక ఇటీవలే తీసుకువచ్చిన దళిత బంధు మంచి పథకమని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా దళితులు బాగుపడుతారని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: