చైనా నుంచి ప్రపంచానికి పాకిపోయిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు మొత్తం అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ పై పోరాటానికి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని దేశాలు కూడా వాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తున్నాయి. భారత్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బాక్సులు ఉచితంగా అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అదే సమయంలో అటు ప్రజలందరిలో కూడా వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.



 దీంతో ఎంతో మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక శరవేగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక వ్యాక్సిన్ కు సంబంధించి ఇంకా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు కేవలం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు. అయితే గర్భిణీలు టీకా వేసుకోవాలా వద్దా అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు  ఇటీవలే గర్భిణీలు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు అంటూ వైద్య నిపుణులు సూచించారు. కాగా ప్రస్తుతం ఎంతో మంది గర్భిణీలు కూడా టీకా వేయించుకుంటున్నారు.



 అయితే చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అందించడం పై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఇటీవల ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి దేశంలోని అందరూ చిన్నారులకు కూడా కరోనా టీకా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు  ప్రస్తుతం మూడు సంస్థలు పరిశోధనలు జరుపూతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.  రోజు రోజుకు కొత్త వేరియంట్ను పుట్టుకొస్తున్న నేపథ్యంలో అందరికీ బూస్టర్ డోస్ అవసరం అంటూ చెప్పుకొచ్చారు. రోగనిరోధక శక్తి తగ్గితే కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు రణదీప్ గులేరియా.

మరింత సమాచారం తెలుసుకోండి: