హుజురాబాద్ రాజకీయాలన్నీ మరో నిజామాబాదును తలపిస్తున్నాయి.  రాష్ట్రం  చూపంతా హుజురాబాద్ నియోజకవర్గం మీదే పడింది. అటు నేతలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల కొరకు వెతుకులాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని మొన్నటికి మొన్న ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యిమంది హుజురాబాద్ బరిలో ఉంటామని చెప్పారు. వీరికి తోడుగా మరో 500 మంది కూడా హుజురాబాద్ పోటీలో ఉంటామని తెలియజేస్తున్నారు.

 దీంతో  సీఎం కేసీఆర్ కు  పెద్ద తలనొప్పిగా మారింది. మరో 500 మంది ఎవరో తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు ఆర్య వైశ్య సంఘాలు సిద్ధమవుతున్నారు. వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ విస్మరించారని, కనీసం పట్టించుకోవడం లేదని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పోటీలో ఆర్యవైశ్య పోరాట సమితి ఆధ్వర్యంలో 500 మంది పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇప్పటికి అందిన సమాచారం. ఇప్పటికే వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీలో  ఉండేందుకు సిద్ధమవుతుండగా తాజాగా ఆర్య వైశ్య సంఘాలు కూడా పోటీలో ఉంటామని చెప్పడం ప్రభుత్వంపై ఎంతో అసహనం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు కేటాయిస్తామన్నా 1000 కోట్ల రూపాయలను అందించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో పోటీకి దిగడం ఖాయమని అంటున్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా హామీలు ఇచ్చి 12 లక్షలకు పైగా ఆర్యవైశ్య ఓట్లను దండుకున్నారని  వారు ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ లో కొనసాగుతున్నటువంటి   జిల్లా స్థాయి నేతలు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం లో  ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ఉంది. ఎన్నికల తేదీ వచ్చినప్పుడు ఎవరు పోటీలో ఉంటారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: