ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రోజురోజుకూ మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే  పరిస్థితి వస్తుంది. ఏకంగా ప్రస్తుత సమయంలో పర్యావరణ కాలుష్యం కారణంగా ఏకంగా ఆక్సిజన్ కొనుగోలు చేసే పరిస్థితులు కూడా ఏర్పడతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది దేశంలో. కేవలం ఒక్క దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు మారుతున్న జీవనశైలి..  అంతేకాకుండా రోజురోజుకు పెరిగిపోతున్న పరిశ్రమలు కారణంగా పర్యావరణ కాలుష్యం పెరిగి పోతూనే ఉంది. అంతే కాదు ఒకప్పుడు ఎక్కడ చూసినా అడవులు కనిపించేవి.. కానీ ఇప్పుడు మాత్రం అడవులను నరికివేసి ఆ ప్రాంతాలలో నగరాలను నిర్మిస్తున్నారు.



 దీంతో నేటి రోజుల్లో పచ్చదనం అనేదే కరువైపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రకృతి విపత్తులు అటు ఎన్నోసార్లు దేశాన్ని హడలెత్తించాయ్. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా అటు మంచు పర్వతాలు కూడా రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి.. మంచు పర్వతాలు ఎలా కరిగిపోతున్నాయి అన్న దానిపై అవగాహన కల్పించేందుకు ఇటీవలే ఎన్ విజన్ రేసింగ్ సంస్థ ఒక వినూత్న ప్రయత్నం చేసింది.



 2248 లీటర్ల నీటితో ఒక ఐస్ కార్ తయారు చేయించింది  దాన్ని లండన్లోని ఓ చోట ప్రదర్శనకు ఉంచింది. అయితే ఇదేదో వింతగా ఉంది అని అక్కడి ప్రజలందరూ ఆ కార్ చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపించారు. అంతేకాకుండా ఆ కార్ ని ఫోటో తీసి తమ సెల్ ఫోన్లలో బంధించారు. అయితే పూర్తిగా ఐస్ తో తయారు చేసిన ఆ కార్ కేవలం 24 గంటల వ్యవధిలోనే కరిగిపోయింది. అయితే ప్రస్తుతం మనుషుల వల్ల కలుగుతున్న గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ కాలుష్యం కారణంగా పర్వతాలు కూడా ఇలాగే కరిగిపోతున్నాయని.. అటు అక్కడి ప్రజలు అందరికీ అవగాహన కల్పించింది ఎన్ విజన్ రేసింగ్. అయితే ఈ కార్ కరిగి పోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలి అంటూ ప్రదర్శనకు ముందు అక్కడికి వచ్చిన ప్రజలందరినీ ప్రశ్నించింది ఈ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: