ప్రవీణ్ టాక్స్  : మాకొక సుందర్ పిచాయ్ కావాలి వస్తడా...

డప్పు కొట్టేవాడు చెప్పు కుట్టేవాడు..అలానే ఉండిపోవడం కాదు..వాళ్ల కోసం విదిల్చే నిధులు//అది అభివృద్ధి కాదు వినాశనం..అంటూ హోరెత్తిపోతున్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ //ఊరి చివరి పాకలు // ఊరంతా పట్టించుకోని జీవితాలు ..తమ నుంచి తాము పొందని భరోసా..ప్రభుత్వం నుంచి దక్కని న్యాయం //ఇవన్నీ తమనో గొప్ప శక్తిగా మలిచేందుకు కారణం అయ్యాయి అంటారు దళిత అభ్యున్నతి కోరేవారు //కానీ కాల గతిలో ఆ చైతన్యం లేకుండా పోవడానికి పాలకులే ప్రలోభాలే ప్రధాన భూమిక పోషించాయి.. ఈ ప్రలోభాలు లేకపోతే దళిత వికాసం సాధ్యమే అన్నది ప్రవీణ్ లాంటి అధికారుల మాట‌....  



దళిత బంధు  పేరిట నిధులు పంచుడు వద్దు అని చెప్తూ కేసీఆర్ పై నిరసన జెండా ఎగుర వేశారు.. ఒకప్పుడు భూమి కోసం భుక్తి కోసం సాగిన ఉద్యమం మరో రూపం దాల్చి కేవలం విద్యావకాశాల సృష్టే పరమావధిగా పనిచేసేందుకు పనిచేయించుకునేందుకు ఈ ఐపీఎస్ అధికారి  ఆలోచిస్తున్నారు.. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తమ నుంచి ఎందుకు కోడింగ్ రాసేవారు డీకోడింగ్ చేసేవారు రాకూడదు.. తమకెందుకు అమెరికా చదువో ఆస్ట్రేలియా కొలువో దక్కకూడదు అన్న మాటతో ఆయన దళితులకో కొత్త చైతన్యం ఇస్తున్నారు. కేసీఆర్ దళిత ఉన్నతాధికారులను సరిగా చూడలేదని వారిని పట్టించుకోలేదని తెలంగాణ అంతటా కనిపించని వివక్ష ఉందని మండిపడుతున్నారు.. మా నుంచి ఒక గూగుల్ సీఈఓ రావాలి.. ఎందుకు సుందర్ పిచాయ్ లాంటి స్థానం మాకు దక్కకూడదు అని పదే పదే పాలక వర్గాలు తమను వెనుకకు నెడుతున్న తీరును ప్రశ్నిస్తూ.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికో కొత్త నిర్వచనం చెబుతున్నారు. ముందున్న కాలంలోనే ఇలానే పనిచేసేందుకు  తనతో కలిసి వచ్చే శక్తులను కలుపుకుని పోతానని, బహుజన ఐక్యత వారి సంక్షేమం అభివృద్ధి కోసం  ఓ వేదిక సిద్ధం చేస్తానంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: