శ్రీశైలంలో పర్యటించిన ఆంధ్ర ప్రదేశ్  బీజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి కామెంట్స్ చేశారు.   జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందు వ్యతిరేక ప్రభుత్వమని.. క్రిష్టియన్ మరియు ముస్లింల అనుకూల వైఖరితో ముందుకు పోతుందని మండి పడ్డారు సోము వీర్రాజు. హిందూ వ్యతిరేక వైఖరిని ప్రశ్నించేందుకు ఆలయ సందర్శన కార్యక్రమం చేపట్టామని సోము వీర్రాజు పేర్కొన్నారు.  వైసీపీ  ఎమ్మెల్యే గోమాతను  కోసుకు తింటే తప్పెంటి అంటాడా ? అని నిప్పులు చెరిగారు. గోవును పట్టుకుని ముస్లింలు కొడితె కేసు పెట్టే దిక్కు జగన్ ప్రభుత్వంలో లేదని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.

అసలు ఈ ప్రభుత్వంలో హిందువులకు భద్రత ఉందా ? అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఆవులను రక్షించాలి అనేది చెత్త చట్టమా ? ఆ ఎమ్మెల్యేను ప్రశ్నించాలసిన దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి జగన్ కి లేదా అని విమర్శలు చేశారు సోము వీర్రాజు. పవిత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అన్యమతస్తులు, ముస్లింలు దేవస్థానం షాపులు నడిపిస్తారా ముఖ్యమంత్రి జగన్ కి జ్ఞానం లేదని మండిపడ్డారు.  సిఎం జగన్ మోహన్ రెడ్డికి జ్ఞానం ప్రసాదించమని స్వామి వారిని కోరుతున్నానని  సోము వీర్రాజు చురకలు అంటించారు.  రఫీ రజాక్ కనుసన్నలలో శ్రీశైలం ఆలయ నడుస్తుందని ఆరోపణలు చేసిన సోము వీర్రాజు..వాళ్ళే ఆలయ సిబ్బంది ట్రాన్సఫర్లు కూడా చేయిస్తారని పేర్కొన్నారు.

 హిందూ దేవాలయాలలో.. ఇలాంటి అరచకాలు ఏంటని ప్రశ్నించారు.    హిందూ సమాజం పట్ల జగన్ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. ఇది ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం.. ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్యెల్యే చెన్నకేశవ రెడ్డి.. గోవధ చట్టం పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. గోవధ చట్టం అసలు పనికిరానిదని.. ఆ చట్టానికి కాలం చెల్లిందని పేర్కొన్నారు. గోవధ చట్టాన్ని కూడా వెంటనే రద్దు చేయాలంటూ.. డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్యెల్యే చెన్నకేశవ రెడ్డి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్యెల్యే చెన్నకేశవ రెడ్డి ఇంటి దగ్గర బిజేపి కార్యకర్తలు నిరసన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: