వాయిస్ ఛేంజ్ : ఇప్పుడు టీడీపీ గేరు మార్చింది?
ఏవో ప్రెస్మీట్లు ..అధికారం లేదు కనుక // మీడియా మైకుల ముందు ఆధారం లేని ఆరోపణలు..అనవసర ప్రకటనలు ఇవేవీ లేకుండా నిర్మాణాత్మక ఉద్యమం కోసం పరితపిస్తుండడం టీడీపీలో వచ్చిన మార్పు..ఈ మార్పు కొనసాగితే పాత లీడర్ల స్థానంలో వచ్చిన ..కొత్త నాయకులు నిలదొక్కుకుంటారు.. వారికి గుర్తింపు ఇస్తుంటే ఇంకాస్త బాగా పనిచేస్తారు. ఆ దిశగా అధినేత ఆలోచించాలి.

అధికారంలో ఉన్నా లేకున్నా మేం ప్రజలతోనే అని చెప్పడంలోనే నాయకులంతా సక్సెస్ అయ్యామని భావిస్తారు. ఒత్తిళ్లున్నా లేకున్నా జనం మధ్యనే ఉంటామని చెబుతారు. అధికారం కన్నా ప్రజా దీవెనే పరమావధి అని ప్రకటనలు జారీ చేస్తారు. ఈ సారి ఇవన్నీ టీడీపీ చెప్పిందో లేదో కానీ కొన్నింటిని మాత్రం చేస్తూ పోతుంది. మునుపటి కన్నా నిర్మాణాత్మక ఉద్యమాలకు ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు విజయనగరం జిల్లానే ఉదాహరణ. ముఖ్యంగా పార్టీలో కొత్త రక్తం వచ్చాక జాబ్ క్యాలెండర్ పై చేపట్టిన నిరసనలు అన్నీ సక్సెస్ అయ్యాయి. ఓ వైపు చైతన్య బాబు వేమలి (తెలుగు యువత) మరోవైపు నాగార్జున కిమిడి (పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు) ఇలా ఎవరికి వారు తమ పంథాను విస్తృతం చేస్తున్నారు. వేగం పెంచడమే కాకుండా కీలకంగా నడిపిస్తున్నారు ప్రజా ఉద్యమాలను.. నిన్నటి వేళ జామి మండలంలో  భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ విషయమై గొంతెత్తారు టీడీపీ నాయకులు.. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో సహా కీలక నాయకులు తరలివచ్చి వేలాది రైతులకు దారి దీపం లాంటి ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు. ఇదొక్కటే కాదు మరికొన్ని ప్రజా ఉద్యమాలకు సైతం క్షేత్ర స్థాయి కార్యకర్తలలో ఉన్న నిస్తేజం దూరం చేసి వారిని పరుగులు తీయిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నా పోలీసుల జులుం ఉన్నా కూడా నిర్బంధాలను లెక్క చేయని వైనం ఇటీవలే తరుచూ చోటుచేసుకుంటుంది. ఐ టీడీపీ ఇంఛార్జుల నియమాకాలు పూర్తి అయినందున ఆ విభాగం కూడా ఇకపై పోరుబాటలో కీలకం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: