రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌గానే కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు తార‌స్థాయికి చేరింది. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రేవంత్‌ను లెక్క‌చేయ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న‌పిల్లాడికింద జ‌మ‌క‌ట్టేస్తున్నారు. హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీనియ‌ర్ నేత‌లైతే రేవంత్‌ను ఆ ప‌ద‌విలో చూడ‌లేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబునాయుడి శిష్యుడు అనే ముద్ర ఉండ‌నే ఉంది అయిన‌ప్ప‌టికీ రేవంత్‌రెడ్డి కూడా వెన‌కాడ‌కుండా త‌న‌లో తెలుగుదేశం పార్టీ వాస‌న‌లు పోలేద‌ని స్ప‌ష్టంగానే చెబుతున్నారు. ప‌ద‌వి చేప‌ట్టిన వెంట‌నే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను క‌ల‌వ‌డం కూడా సీనియ‌ర్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

రేవంత్‌కు ఏమీ తెలియ‌దు?
ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌ట‌కీ రేవంత్ రెడ్డిని ఏమీ తెలియని నాయకుడిగానే కాంగ్రెస్ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. సాధార‌ణంగా కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువగా ఉంటుంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే విభేదాలు, వివాదాలు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలోనే ఏమీ లేక్క‌చేయ‌కుండా వ్య‌వ‌హ‌రించిన అస‌మ్మ‌తి వ‌ర్గం మూడు సంవ‌త్స‌రాల క్రితం పార్టీలో చేరిన రేవంత్‌ను లెక్క‌చేస్తుందా? అనే సందేహం క‌లుగుతోంది. రేవంత్‌రెడ్డి ప‌క్క‌న ఉండేవారు కూడా అంద‌రూ తెలుగుదేశం నుంచి వ‌చ్చి కాంగ్రెస్‌లో చేరిన‌వారే ఉంటున్నారు. ఇది కూడా వారికి మండుతోంది. ఒక‌ర‌కంగా ఈ ప‌రిణామాల‌న్నీ ఆ పార్టీలో కొత్త వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. సీనియ‌ర్ల ఆలోచ‌న ఎలా ఉందంటే.. అధికారం సంగ‌తి త‌ర్వాత మేం రేవంత్ వెన‌క న‌డ‌వ‌డం ఏమిటి? అనే ఆలోచ‌నే వారికి నిద్ర‌కూడా ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తోంద‌ని, వీరి మ‌నోవేద‌న చూస్తోంటే కాంగ్రెస్ పార్టీని ఎవ‌రూ ఓడించ‌న‌క్క‌ర్లేద‌ని, వారికివారే ఓడించుకుంటార‌ని వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్ల వైఖ‌రి చూస్తుంటే రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్ర‌యోగం విక‌టిస్తుందేమోన‌నే సందేహం క‌లుగుతోందంటున్నారు.

వెన‌క్కి లాగుతున్న సీనియ‌ర్లు?
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టినుంచి ఆయ‌న్ను వెన‌క్కిలాగ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌గా, మొండిగా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర్గ‌పోరు జ‌రిగిందంటే ఒక అర్థం ఉంటుందికానీ, ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చి కూడా కేసీఆర్ చేతిలో మోస‌పోయి రెండుసార్లు ఎన్నిక‌లు జ‌రిగినా క‌నీసం త‌మ‌వ‌ల్లే ప్ర‌త్యేక తెలంగాణ వ‌చ్చింద‌ని చెప్పుకోలేక‌పోతున్న ఈ నేత‌లవ‌ల్ల అధికారం సంగ‌తి దేవుడెరుగు.. అధికారంలోకి రానీయ‌కుండా చేసే ప్ర‌య‌త్నాలు ఎక్కువ‌గా ఉంటున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి:

tag