సాయిరెడ్డికీ, బీజేపీకీ ఎటువంటి స్నేహం ఉంది లేదా ఉండేది..కేవ‌లం ఆరోప‌ణ‌ల వ‌ర‌కే ప‌రిమితం అయి బీజేపీతో లోపాయికారీ ఒప్పందాల్లో వైసీపీ ఉందా? అన్న‌వి విప‌క్షాల ప్ర‌శ్న‌లు.. తాము పోరాడుతుంటే త‌మ‌కు క్రెడిట్ ద‌క్కుతుంద‌న్న నెపంతో ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఆనాడు న‌ల్ల చ‌ట్టాల‌ను ఎందుకు వ్య‌తిరేకించ‌లేక‌పోయింద‌ని టీడీపీ లాంటి పార్టీలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఏదేమైన‌ప్ప‌టికీ త‌ప్పు బీజేపీది భారం వైసీపీది.. అన్న‌ది టీడీపీ తో స‌హా ఇంకొంద‌రు తేల్చిన మాట. ఓ విధంగా టీడీపీ స్నేహం బీజేపీకి అవ‌స‌రం కొంత కాలం కింద‌ట ఇప్పుడు సీన్ అలా లేదు..వైసీపీ స్నేహం బీజేపీకి అక్క‌ర్లేదు కానీ ఎందుక‌నో సాయిరెడ్డి అండ్ కో మోడీ ప్ర‌స‌న్న‌త కోసం కొంత కాలం వెంప‌ర్లాడి, మొక్కులు మొక్కి త‌రువాత ఇప్పుడు కొంత వ్య‌తిరేక స్వ‌రం వినిపిస్తున్న‌ది ఎందుకో అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ అంటోంది.


రాష్ట్రాల‌కూ వాటికి సంబంధించిన హ‌క్కుల‌కూ సంబంధించి ఇటీవ‌ల కేంద్రంకు ఇత‌ర పార్టీల‌కూ దూరం పెరుగుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవత‌రించాక ఏక‌ప‌క్ష ధోర‌ణులే ఎక్కువ  అయ్యాయ‌ని కమ్యూనిస్టులు విమ‌ర్శిస్తున్నారు. త‌మ ప్రాబ‌ల్యం పెంచుకుని ప్రాంతీయ పార్టీల‌ను ప‌ట్టించుకోని వైనం ఇవాళ బీజేపీలో ఉంద‌ని, అందుకే వైసీపీకీ, టీఆర్ఎస్ కూ కూడా పెద్ద‌గా ప్ర‌యార్టీ ఇస్తున్న పాపాన పోవ‌డం లేద‌ని ఢిల్లీ మీడియా లో వినిపించే మాట. కానీ వైసీపీ బీజేపీ చేసిన త‌ప్పిదాల‌ను తన ఖాతాలో వేసుకుంది అని, ఆ పార్టీ తీసుకువ‌చ్చిన న‌ల్ల చ‌ట్టాల‌ను క‌నీసం మ‌ద్ద‌తు అడ‌గ‌కుండానే బాహాటంగానే స‌మ‌ర్థించింద‌ని క‌మ్యూనిస్టుల‌తో స‌హా ఇంకొంద‌రు పెదవి విరిచారు. న‌ల్ల చ‌ట్టాలుగా పేర్కొన్న ఆధునిక వ్య‌వ‌సాయ చ‌ట్టం, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ఇవ‌న్నీ పార్ల‌మెంట్ లో వైసీపీ మ‌ద్దుతు పొందాయి. ఓ విధంగా త‌ప్పు బీజేపీ చేసింద‌ని కానీ వైసీపీ కూడా ఆ భారం మోసింద‌ని విప‌క్షాలు మండి ప‌డ్డాయి. వాస్త‌వానికి వైసీపీ చెప్పుకుంటుందే కానీ బీజేపీ ఏనాడూ త‌మ మిత్ర ప‌క్షం ఫ‌లానా వారు అని ఏపీ కి సంబంధించి చెప్పిందీ లేదు.. చేసిందీ లేదు.. పార్లమెంట్ లో అంశాల వారీగా మ‌ద్దుతు కోర‌డం అన్న‌ది ఇవాళ బీజేపీ వైసీపీ నుంచి ఆశించిన దాఖాలా లేదు.. అలాంట‌పుడు మోడీని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఈ చ‌ట్టాల‌కు మ‌ద్దతు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల  కోసం తాము స‌మావేశాల‌ను స్తంభింప‌జేస్తామ‌ని చెప్ప‌డం రాజ‌కీయ వ్యూహ చ‌తురుత‌కు నిద‌ర్శ‌నం కావొచ్చు అని కొంద‌రి విప‌క్ష పార్టీల భావ‌న.

మరింత సమాచారం తెలుసుకోండి: