పుట్టిన రోజు వేడుక‌కు ముందే చావు త‌న‌ని ప‌లుక‌రించింది. అబ‌ద్ద‌మే ఆ పాప పాలిట అంతం అయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి అనంత‌లోకాల‌కు వెళ్ల‌డంతో ఆ త‌ల్లిదండ్రుల గుండెలు ప‌గిలిపోయాయి. హ‌ఠాత్తుగా చిన్నారి నుర‌గ‌లు క‌క్కుతూ మ‌ర‌ణ శ‌య్య‌కు దూరం అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేరు. అమ్మానాన్న‌లు తిడుతార‌ని పాము క‌రిచిన విష‌యాన్ని దాచ‌డంతో ముక్కుప‌చ్చ‌లు ఆర‌ని చిన్నారి మ‌రణానికి చేరువ‌యింది. ఇంకా లోకాన్ని ఎంతో చూడాల్సిన క‌ళ్లు ప‌సిప్రాయంలోనే మూత‌ప‌డ్డాయి.

ఓ దంపతులు త‌మ‌కు ప‌దిహేనేళ్ల‌యినా సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డంతో బంధువుల పాప‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు. ఆ పాప త‌న ఎనిమిదో పుట్టిన రోజును అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని వెళ్లింది. అయితే అక్క‌డ ఆడుకునే క్ర‌మంలో పాము క‌రిచింది. ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెబితే తిడాత‌ర‌ని బ‌య‌ప‌డింది దీంతో చిన్నారి చ‌నిపోయింది. ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్‌, భారతి దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. ఏళ్లు గ‌డిచినా సంతానం కలగకపోవడంతో ఏడు సంవ‌త్స‌రాల‌ క్రితం త‌మ బంధువుల పాప అఖిలను దత్తత తీసుని ఆర్నెల్ల ప్రాయం నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పాపే ప్రాణంగా ఆ దంపతులు జీవించారు.


 అఖిల త‌న ఎనిమిదో పుట్టినరోజు వేడుకను ఆదివారం అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరం అంద‌రు వెళ్లారు. శ‌నివారం సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న క్ర‌మంలో  ఓ విష స‌ర్పం ఆమెను క‌రిచింది. దీంతో ఒక్కసారిగా భయపడిన చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని అఖిల‌ దాచిపెట్టింది. అయితే కాలికి మేకు గుచ్చుకుందని వాళ్ల‌కు అబద్ధం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో వాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిసేపటికే చిన్నారి అఖిల నుర‌గ‌లు క‌క్క‌డంతో వేలిపై పాము కాట్లను గుర్తించారు.

         భ‌య‌ప‌డిన త‌ల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంలో ఉన్న ఆసుప్ర‌త్రికి తీసుకెళ్లారు. అయిదారు ఆసుపత్రులకు వెళ్లినా చిన్నారిని చేర్చుకోలేదు.  చిన్నారిని అంబులెన్స్‌లో కొత్త‌గూడెం నుంచి ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్ప‌టికే ఆల‌స్యం అవడంతో విష‌యం శ‌రీరం అంతా పాకి చికిత్స పొందుతూ శ‌నివారం రాత్రి అఖిల మ‌ర‌ణించింది. ఆదివారం బంధువులు చిన్నారి అఖిల‌కు అంత్య క్రియ‌లు నిర్వ‌హించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: