గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పామును చూస్తే చాలా మంది జడుసుకుంటారు. పాము ఉందంటే అటు వైపు పరిసరాలకు కూడా పోవడానికి జంకుతారు. కానీ అటువంటి పాములు వ్యవసాయ పనులు చేసేటపుడు పల్లెటూళ్లలో వ్యక్తులను తరుచుగా కరుస్తూ ఉంటాయి. చాలా మంది పాము కాటేస్తే.. నాటు వైద్యం చేసుకుని ఆస్పత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన ప్రాణాలను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. కొంత మంది చెట్ల పసరులతో పాము కాటు నయమవుతుందని నమ్మి చాలా అవస్థలు పడతారు. కానీ ఎలాంటి పామైనా సరే కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి వెళ్లడం ఉత్తమం. కానీ గ్రామాల్లో చాలా మంది పాము కాటేస్తే ఆస్పత్రులకు వెళ్లడానికి వెనుకడుగు వేస్తారు. అందుబాటులో ఉన్న నాటువైద్యాన్ని నమ్ముకుని విలువైన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఇలా చాలా రకాల పాములు చూసేందుకు చిన్నగా ఉన్నా కూడా అవి కాటేస్తే మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అలా చూసేందుకు చిన్నగా కనిపించే పాముల్లో సా-స్కేల్డ్ వైపర్ ఒకటి. చూసేందుకు చిన్నగా ఉన్నా.. ఇది అత్యంత విషంతో కూడుకున్నది. ఇవి ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా, భారత ఉపఖండం దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ జాతి పాములు ఎక్కువగా రాత్రి వేళల్లో కాటు వేస్తాయి. మరో భయంకరమైన విషయం ఏంటంటే మనదేశంలో పాముకాటు వల్ల మరణించే వారిలో ఎక్కువ శాతం మంది ఈ సా–స్కేల్డ్ వైపర్ జాతి పాములు కుట్టడం వల్లనే మరణిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవే కాకుండా కట్ల పాము కుట్టినా కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇది దాదాపు ఐదు నుంచి తొమ్మిది అంగుళాల పొడవు ఉంటుంది. రక్తపింజేరి కూడా  ప్రమాదకరమైన పాముల జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంది. అందువల్లే జనావాసాల వద్ద ఈ పాము తరుచుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నాగుపాము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాము కుట్టి ప్రాణాలు కోల్పోయిన వారు మనదేశంలో అనేక మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: