రాజకీయ నేతలే కాదు.. సినీ ప్రముఖులు కూడా బాడీగార్డులను నియమించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వారు ఎప్పుడైనా ప్రజలలోకి, ప్రేక్షకుల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ప్రేక్షకుల నుండి తొక్కిసలాట లో వీరికి ఏమి కాకుండా.. వీరికి చుట్టూ అనుచరులను నియమించుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లు , హీరోలు కూడా వారికి బాడీగార్డులను నియమించుకొని, వారికి కోట్లలోనే ముట్ట చెబుతున్నారు అంటే వారికి ఎంత సెక్యూరిటీ అవసరమో అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన బాడీ గార్డ్ లకు  ఎంత ఇస్తున్నాడు అనే వార్త  చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీ లోకి ఒక అమాయకుడిగా అడుగుపెట్టి , ప్రస్తుతం రాజకీయ నేతగా ఎదిగిన ఒక గొప్ప స్టార్ అని చెప్పవచ్చు. అంతే కాదు ఈయన చాలా మొహమాటస్తుడని,ఎవరిని ఏది తొందరగా అడగలేరు అని ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈయనకు దేశవ్యాప్తంగా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఇక రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తప్పకుండా ఒక బాడీగార్డులను నియమించుకోవాల్సిందే..

ఇక అసలు విషయానికి వస్తే , పవన్ కళ్యాణ్ చుట్టూ ఐదు మంది బాడీగార్డులు ఉండటం మనం గమనించే వుంటాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే బహిరంగ సభలకు, ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారిని కంట్రోల్ చేయడం అసాధ్యం. కాబట్టి వారి నుండి దూరంగా ఉంచడం కోసం పవన్ కళ్యాణ్ ఐదు మంది బాడీగార్డులను నియమించుకున్నారు. ఇకపోతే ఈయన ఒక్కొక్కరికి రూ. 50 వేల నుండి లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక వారు పవన్ కళ్యాణ్ కు  అంత సెక్యూరిటీ ఇస్తున్నారు కనుక ఆయన ఇంత ఇవ్వడంలో అతిశయోక్తి లేదని మరి కొంతమంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: