త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి మాజీ మంత్రి.. ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న విజ‌యాన్ని రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. అంతేకా దు.. ఇక్క‌డ గ‌తంలో క‌నీ విన‌ని విధంగా.. రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంద‌ని చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌భుత్వం ప‌రంగా.. ఆయ‌న న‌మ్మిన పార్టీ ప‌రంగా.. ఈట‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌డమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో ఈట‌ల‌పై సానుభూతి మెండుగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

రాజకీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఈట‌ల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ‌ల‌కు ఆదేశించింద‌ని.. కేసులు న‌మోదు చేయించింద‌ని.. ఇక్క‌డ ప్ర‌జ‌ల మ‌ధ్య జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ప్ర‌భుత్వంలోనూ మంత్రిగా ఉన్న ఈట‌ల విష‌యంలో ఇప్పుడు మాత్ర‌మే త‌ప్పులు ఎందుకు క‌నిపించాయ‌నేది ఇక్క‌డి వారి ప్ర‌శ్న‌. ఇదంతా కూడా రాజ‌కీయ ప్రేరేపిత కుట్రగానే ప్ర‌జ‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. నిజానికి బీసీ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగిన ఈట‌ల‌కు తెలంగాణ‌ ఉద్య‌మ నేప‌థ్యం ఎంతో ఉంది.

తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌తో స‌మానంగా ఉద్య‌మించిన నాయ‌కుడు ఈట‌ల‌. ఆయ‌న వాగ్ధాటి.. ప‌దునై న తూటాల్లాంటి మాట‌లు.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌ట్టిప‌డేస్తాయి. రాష్ట్రం కోసం.. రాష్ట్ర భవిత‌వ్యం కోసం.. నిరంత‌రం స్వ‌ప్నించే నాయ‌కుడిగా కూడా ఈట‌ల‌కు మంచి పేరుంది. అలాంటి నేత‌పై వ‌చ్చిన ఆరోప ణ‌లు కేవ‌లం రాజ‌కీయ ప్రేరేపితాలేన‌ని.. హుజూరాబాద్ ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల‌ను అఖండ మెజారిటీతో గెలిపించుకోవ‌డం ద్వారా.. ప్ర‌భుత్వానికి త‌గిన బుద్ధి చెప్పాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం ప‌రంగా చూస్తే.. వ‌రుస విజ‌యాల‌తో ఈట‌ల త‌న ప్ర‌స్థానానికి తిరుగ‌లేద‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు నిరూపించుకున్నారు. 2009, 2010, 2014, 2018 ఎన్నిక‌ల్లో ఈట‌ల ఇక్క‌డ నుంచి ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అంతేకాదు.. 2010ఎన్నిక‌ల్లో క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా 79 వేల పైచిలు కు ఓట్ల మెజారిటీతో ఈట‌ల విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోం ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ద‌ఫా దాదాపు ల‌క్ష మెజారిటీతో ఆయ‌న విజ‌యం సాధించినా.. ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈట‌ల విష‌యంలో ఇప్పుడు రెండు ర‌కాల సెంటిమెంట్లు వ‌ర్కువుట్ అవుతున్నాయి. ఒక‌టి.. ప్ర‌భుత్వం, టీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయ‌న‌పై రాజ‌కీయ క‌క్ష ప్రేరేపిత చ‌ర్య‌ల‌కు దిగింద‌నే సానుభూతి పెల్లుబుకుతోంది. అదేస‌మ‌యంలో బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిని అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన నేత‌లు.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇబ్బంది పెడుతున్నార‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఈట‌ల‌కు ఘ‌న విజ‌యం అందించ‌డం ద్వారా.. ఆయ‌న‌పై ఉన్న అభిమానాన్ని చాటు కునేందుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: