వైఎస్ జగన్ సర్కార్ కు ఎదురెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురపోరులో సత్తా చాటిన ఏకైక మునిసిపాలిటి అనంతపురం జిల్లా తాడిపత్రి. పూర్తి మెజారిటీతో మునిసిపల్ పోరులో తెలుగుదేశం జెండా ఎగిరేలా చేసింది జేసీ సోదరులే. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి తాడిపత్రి రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. జేసీ సోదరుల వ్యాపారాలపై కేసులు, అరెస్టులు.. ఇంకే ఎన్నో ఎన్నెన్నో. అన్నిటికీ ధీటుగానే బదులిచ్చారు జేసీ బ్రదర్స్. ఒక దశలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గం దాడికి కూడా యత్నించింది. మునిసిపల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కూడా అదే స్థాయి వార్నింగ్ తో తాడిపత్రి పాలిటిక్స్ లో మరింత వేడి పెంచారు జేసీ ప్రభాకర్.

సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రైనింగ్ సెంటర్ లో సొంత పార్టీ వాళ్లకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్. చంద్రబాబు తనను సస్పెండ్ చేసినా సరే... పార్టీ కోసమే కష్టపడుతా అన్నారు. అలాగే చిత్తశుద్ది లేని వాళ్లు పార్టీ వదిలి వెళ్లిపోవాలన్నారు. అనంతపురం పట్టణంలో చంద్రబాబుతో పది వేల మందితో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తానన్నారు. ఇప్పుడు తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి జేసీ ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేము తలచుకుంటే నీ పరిస్థితి ఏమిటో తెలుసా అన్నారు. అసలు మేము తిరగబడితే... కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేరు అంటూ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మునిసిపల్ అభివృద్ధికి సహకరించాల్సిన ఎమ్మెల్యే... కనీసం స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా కూడా నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: