ఏం చేద్దాం ఇప్పుడు : అంతా బాబే చేశారు?

ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఓ విష‌యం స్ప‌ష్టం చేశారు. కోవిడ్ కార‌ణంగా రాష్ట్రం సంక్షోభంలో ఉంది అని చెప్పి, సంబంధిత స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు సీఎం ఏ విధంగా కృషి చేస్తున్నారో చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే అప్పులు ఉన్నాయి అని, తాము వాటిని తీరుస్తూ ముందుకు పోతున్నామ‌ని దాదాపు మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల అప్పులు ఉన్నాయ‌ని ఆయ‌న లెక్క తేల్చారు. అదేవిధంగా తాము ఈ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కే మార్గం వెతుకుతుంటే టీడీపీ, బీజేపీ స‌హ‌క‌రించ‌క‌పోగా త‌మ‌కు ప‌క్క‌లో బల్లెంలా మారాయ‌న్న‌ది ఆయ‌న అభిమ‌తం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పించ‌డంలో బీజేపీ నేత‌ల చొర‌వ ఏమీ లేద‌ని ఒక‌వేళ అలాంటి చ‌ర్య ఒక‌టి తీసుకుంటే మేలు అని ఆయ‌న చెప్పారు.


 అదేవిధంగా టీడీపీ సైతం పాల‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోగా, రాజ‌ధాని స‌మ‌స్య‌ను భూత‌ద్దంలో చూపెడుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఇదీ ఇవాళ్టి రామ‌కృష్ణా రెడ్డి చెప్పిన మాట. ఐతే ఈ మాట‌లువింటే ముందుగా త‌ల్చుకునేది అప్పులు గురించే.. ఇప్ప‌టికిప్పుడు మ‌న‌కు అప్పులు పుట్ట‌వు అని తేల్చేరు బ్యాంక‌ర్లు..పోనీ బాండ్లు జారీ చేసి నిధులు సేక‌ర‌ణ చేద్దాం అంటే కుద‌ర‌ని ప‌ని.. ఒక‌టో తారీఖు వ‌చ్చేనాటికి జీతాలు ఇవ్వ‌లేక మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఉద్యోగుల‌కు సెల‌వులో ఉండిపొమ్మ‌ని చెబుతోంది. మ‌రి మ‌న సంగ‌తో! ఇక్క‌డ ఇబ్బడి ముబ్బ‌డిగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్న కార‌ణంగా మ‌న‌కు అలాంటి ప‌రిస్థితే వ‌స్తే .. అప్పుల విష‌య‌మై కేసీఆర్ తో పోటీపడుతూ లేస్తూ జ‌గ‌న్ ముంద‌డుగు వేస్తున్నారు. ఆయ‌న బై పోల్ వ‌స్తే చాలు ప‌థ‌కాలు అనౌన్స్ చేస్తే ఈయ‌న ఉన్నా లేకున్నా  ప‌థ‌కాలు అనౌన్స్ చేసి  త‌న గొప్ప‌లు ప్ర‌క‌టించుకుంటార‌ని టీడీపీతో స‌హా విప‌క్షాలు చేస్తున్న వ్యాఖ్య‌. ఇదే విధంగా కొన‌సాగితే రాష్ట్రంలో కొత్త స‌మస్య‌లు పుట్టుకు రావడం ఖాయ‌మేమో అన్న‌ది వారి అభిప్రాయం. సంక్షేమ ప‌థ‌కాలు ఉన్నాయి క‌నుక‌నే ప్ర‌జ‌లు ఆ మాత్రం అయినా జీవనం సాగిస్తున్నార‌ని వైసీపీ చెబుతోంది

కానీ రేప‌టి వేళ ఇదే విధంగా కొన‌సాగితే ఆదాయం లేక కేవ‌లం అప్పులే మిగిలితే ఈ సంక్షోభాన్ని కేంద్రం నివారిస్తుందా? అన్న‌ది ఓ ప్ర‌శ్న. ఎందుకు నివారిస్తుంది...అది జ‌ర‌గ‌ని ప‌ని అని వివేకం ఉన్న వారెవ్వ‌రికి అయినా అర్థం అయ్యే విష‌యం. సంప‌ద సృష్టికి ఏపీ స‌ర్కారు చేస్తున్న కృషి ఏంట‌న్న‌ది ఇవాళ్టికీ పాలుపోతే ఒట్టు.. ఆ మాటేదో రామకృష్ణా రెడ్డి చెబితే మేలు.. అన్న‌ది టీడీపీ వాద‌న. మొత్త‌మ్మీద తెలుగురాష్ట్రాలు అప్పుల్లో టాప్ గేర్ లో ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. ల‌క్ష కోట్ల బ‌డ్జెట్ ఒక‌నాడు ఇప్పుడు రెండు ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ అస్స‌లు స‌రిపోదు..ఇంకెంత తేవాలో కావాలో ఆ దేవుడికే ఎరుక అన్న‌ది టీడీపీ మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: