హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఎంతో హాట్ హాట్ గా మారిపోయాయ్. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అసలు ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కానీ ఇప్పటికే రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.  అయితే టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వేరుపడి బీజేపీలో చేరిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేసి కెసిఆర్ కి సవాల్ విసిరారు.



 దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలను ఎంతో సవాల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా కౌశిక్ రెడ్డి లాంటి నేతను టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పట్లో ఈటెల  బిజెపిలో చేరబోతున్నారు అనే టాక్ వినిపించిన సమయంలో పెద్దిరెడ్డి పేరు ఎక్కువగా వినిపించేది. ఒకవేళ ఈటెల బీజేపీ లో చేరితే ఇక పెద్దిరెడ్డి బిజెపికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరే అవకాశముందని ఇక టీఆర్ఎస్ అటు పెద్ద రెడ్డి కి హుజురాబాద్ నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది అని టాక్ వినిపించింది.



 అయితే ఇటీవల ఎవరూ ఊహించని విధంగా కొత్త వ్యక్తి అయినా ఎన్నారై శ్రీకాంత్ రెడ్డికి టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపించగా.. ఇక ఇప్పుడు మరో సారి పెద్దిరెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. ఎందుకంటే బీజేపీ నుంచి హైదరాబాద్ ఉప ఎన్నిక టిక్కెట్ ఆశించారు పెద్దిరెడ్డి. కానీ ఈటల బిజెపిలో చేరడం తో ఆయనకే ఉప ఎన్నిక టికెట్ ఖరారు అయ్యింది. దీంతో ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు పెద్దిరెడ్డి.  అయితే బిజెపికి రాజీనామా చేసిన పెద్ద రెడ్డి టిఆర్ఎస్లో చేరే అవకాశాలున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది ఇక ఒకప్పుడు ప్రచారం జరిగినట్లుగానే పెద్దిరెడ్డి కే టి ఆర్ ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: