సాధారణంగా అడవుల్లో ఉండే క్రూరమృగాలలో పులి కూడా ఒకటి. అయితే ఆకలి వేసింది అంటే ఇక కనుచూపు మేరలో ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువునీ వేటాడి వెంటాడి తనకు ఆహారంగా మలుచుకుంటూ ఉంటుంది. అయితే సాధారణంగా సింహం, పులి లాంటి జంతువులు ఇతర జంతువులను వేటాడి నప్పుడు అంతగా మజా రాదు. కానీ ఒక చిరుత పులి జింకను వేటాడుతుంటే టీవీలో చూస్తున్న కూడా అందరిలోనూ ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రాణభయంతో ఎంతో వేగంగా పరిగెడుతుంది.  కానీ అంతకు మించిన వాయువేగంతో చిరుత పరిగెడుతూ ఉండటం చూస్తూ ఉంటే అందరూ కన్నార్పకుండా టీవీ చూస్తూ ఉంటారు.



 ఇక ఇలాంటి ఛేజింగ్ చూస్తున్నప్పుడు ప్రతి సారి ప్రతి ఒక్కరి గుండెల్లో ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంటుంది. అయితే ఇలా జింక వెనుక పులి వాయువేగంతో పరిగెడుతున్న సమయంలో ఇక ఆ జింక కి భూమి మీద నూకలు చెల్లి పోయాయి దాని పని ఖతం అయిపోయింది అని అనుకుంటారు అందరు..  అయితే కొన్ని కొన్ని సార్లు నిజంగానే ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మరి కొన్నిసార్లు మాత్రం జింక తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన తెలివితేటలు అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఇక పులికి దొరకకుండా పారిపోతూ ఉంటుంది. ఇక సరిగ్గా చిరుత పులి పంజా విసురుతుంది అన్న సమయంలో జింక మలుపులు తిరగడం ఒక్కసారిగా దిశను మార్చుకుని పరుగెత్తడం వంటివి చేస్తూ చిరుతపులి బారినుంచి బయటపడుతుంది.



 అయితే చిరుత పులి అన్ని జంతువుల కంటే ఎంతో వేగంగా పరిగెత్తకలుగుతుంది.. ఇక చిరుత పులి వేగం ముందు అటు జింక కూడా పనిచేయలేదు. కానీ వేగంగా పరుగెత్తుతున్న చిరుతపులి వెంటనే జింక తరహాలో తన దిశను మార్చుకోలేదు. వెంటనే మలుపులు తిరిగ లేదు చిరుత పులి. ఇక చిరుత పులి లో ఉన్న ఈ బలహీనత ఏకంగా జింకకు బలం గా మారిపోతూ ఉంటుంది. ఇక ఎంతటి బలవంతుడైన ఒక చిన్న బలహీనతను కలిగి ఉంటాడు అన్నది చిరుత పులిని చూస్తే అర్థమవుతుంది. భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే చిరుత పులి వేట లో ఎన్ని మలుపులు ఉంటాయో అని శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: