ద‌ళిత బంధును న‌మ్మేదేలే.. : రాముల‌మ్మ ఏమ‌న్న‌దంటే...

ఇలా ఉంటే రాజ‌కీయం అని చెప్ప‌లేం..ఇదే రాజ‌కీయం అని తేల్చ‌లేం. కానీ ద‌ళిత జ‌నం పై ఇప్పుడు వ‌స్తున్న ప‌థ‌కాల గాలి ఏమ‌న్నా ఉందీ అంటే అదంతా హుజూరాబాద్ బై పోల్ ద‌య అని అంటున్నారు తెలంగాణ లీడ‌ర్ రాముల‌మ్మ.. ఈ త‌ర‌హా రాజుకున్న మాట‌ల సెగ‌తో.. ఎప్ప‌టిలానే రాజ‌కీయం  మరొక్క మారు వేడెక్కింది. ల‌ష్క‌రు బోనాల వేళ.. ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ త‌న గొంతుక వినిపించారు. ఎప్ప‌టి లానే త‌న దైన పంథాలో టీ స‌ర్కారును కార్న‌ర్ చేశారు.

 

హుజూరాబాద్ ఎన్నిక‌ల వేళ ఈ మాట‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ కు చర్చనీ యాంశం అయ్యాయి. త‌న దైన పంథాలో రాష్ట్రంలో నెల‌కొంటున్న ప‌రిణామాలు, గ‌తంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు వివ‌రిస్తూ, విశ్లే షిస్తూ..టీ సర్కార్ పై రాముల‌మ్మ ఫైర్ అయ్యారు. ద‌ళిత బంధు ప‌థ‌కం పై త‌న‌కున్న అనుమానా లు అన్నింటినీ వివ‌రిస్తూ ఇవాళ మాజీ ఎంపీ విజ‌య‌శాంతి మాట్లాడారు. కేసీఆర్ కు ద‌ళిత బంధు ప‌థ‌కం నిజాయితీతో కూడిన భావంతో అమ‌లు చేయాల‌ని ఉంటే తాము స్వాగ‌తిస్తామ‌ని అన్నారు. ఇంకా ఆమె ఏమ‌న్న‌రంటే.. 



ద‌ళిత బంధు ప‌థ‌కం ప‌క్కా ఎన్నిక‌ల  ప‌థ‌కం అంటున్నారు స‌రే.. ఎన్నిక‌ల కోస‌మే అయితే ఇప్పుడు కేటాయించే నిధులు ఎప్ప టికి వెచ్చిస్తారు అన్న‌ది ఆమె ప్ర‌శ్న. గ‌తంలో  ప‌థ‌కాల పేరిట కేసీఆర్ ద‌ళితుల‌ను నిలువెత్తున మోసం చేశార‌ని ఆమె ఆరోప‌ణ. అంతేకాదు హుజూరాబాద్ లో మిగ‌తా సామాజిక వ‌ర్గాలూ స్పందించి, త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే అధికార పార్టీ నాయ‌కుల‌నునిలదీయాల‌ని చెప్పారు.

 
ఇంకా ఏమ‌న్న‌రంటే: మూడు ఎకరాల స్థ‌లం ఇయ్య‌లే //డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లు క‌ట్టియ్య‌లే // అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హ ఏర్పాటు ఇప్ప‌టిదాకా చేస్త‌లే..
అన్న‌ది ఆమె ఆవేద‌న.. ఇదీ ఇవాళ్టి రాముల‌మ్మ స్పీచ్ లో ప్ర‌ధాన‌మ‌యిన మాట‌లు..


మరింత సమాచారం తెలుసుకోండి:

trs