వాయిస్ ఆఫ్ ద‌ళిత్ : అందరికీ న్యాయం అదే నినాదం
అవ‌మానాల నుంచి వ‌చ్చిన ఉద్య‌మం..ఆత్మ‌గౌర‌వం పెంపున‌కు వ‌చ్చిన ఉద్య‌మం.. సామాజిక సాధికారికత దిశ‌గా వ‌చ్చిన ఉ ద్యమం.. ఈ తెలంగాణ ఉద్య‌మం.. నాలుగు కోట్ల ఆకాంక్ష‌లు గౌర‌వించింది..ఆ కోవ‌లో పుట్టిన కొంద‌రు ఉద్య‌మ‌కారులు ఈ రోజు చాలా ఆగ్ర‌హంతో ఉన్నారు.. ద‌ళితులు మాత్ర‌మే ప్ర‌జ‌లా అన్న ప్ర‌శ్న‌తో వాళ్లు ఉద్య‌మ పంథాను అనుస‌రిస్తున్నారు. తాను వి ద్య.,వైద్యం త‌దిత‌ర రంగాల‌కు ఊత‌మిచ్చి ఆయా రంగాల్లో ద‌ళితుల‌కు అవ‌కాశం ఇచ్చేవారికే మ‌ద్ద‌తు ఇస్తానని, డ‌బ్బులు పంచే వారికి ఇవ్వ‌న‌ని తేల్చేశారు ఐపీఎస్ ప్ర‌వీణ్..అలానే ఇదే కోవ‌లో మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్ రాముల‌మ్మ  కూడా  అన్ని సామాజిక‌వ‌ర్గా ల‌కూ న్యాయం ద‌క్కాలే కానీ ఇలా ఓట‌ర్ల‌ను విడ‌దీసి చూడ‌డం త‌గ‌ద‌ని కేసీఆర్ కు హిత‌వు చెప్పారు. కాస్త ప‌దునైన మాట‌ల‌తోనే ఆమె  త‌న వాగ్బాణాలు సంధించి సోష‌ల్ మీడియాలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు.


టార్గెట్ కేసీఆర్ : ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా  ఒక నినాదం వినిపిస్తుంది. అదే సామాజిక తెలంగాణ. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటున్నారు.. విమ ల‌క్క లాంటి ప్ర‌జా సంఘ ప్ర‌తినిధులు సామాజిక తెలంగాణ అంటున్నారు..తెలంగాణ ఏర్పాటుతో వ‌చ్చింది కేవ‌లం  ప్ర‌త్యేక ప్ర‌భుత్వం త‌ప్ప ప్ర‌త్యేక గొంతుక‌లకు ఏమీ విలువ‌లేద‌ని కోదండ‌రామ్ లాంటి ప్రొఫెస‌ర్ల ఆవేద‌న..ఇలాంటి సంద‌ర్భంలో హుజూరా బాద్ ఓ ప్ర‌త్యేకం అయిన వాదంను వినిపిస్తుంది. వాక్ ప‌ఠిమ‌ని వినిపిస్తుంది. ఇవాళ రాముల‌మ్మ మాట్లాడారు.. తాను ద‌ళిత ఉప ముఖ్య‌మంత్రులు ద‌క్కిన అవ‌మానాన్ని మ‌రిచిపోలేన‌ని అన్నారు. తెలంగాణ యాస‌లో ధూం ధాం ఆడారు. త‌న‌దైన శైలిలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు.


అంకెలు .. అప్ప‌గింత‌లు : నాడు ద‌ళితుల‌దే రాజ్యాధికారం అని చెప్పి, ఇప్పుడూ రాజ్యం ఇచ్చే తాయిలాలు అని చెప్పి మోస‌గించ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు ఆమె... ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ఈ మాట‌ల‌కు స‌ర్కారు స‌మాధానం చెప్పాల్సింది కేవ‌లం మాట‌ల‌తో కాదు ఆచ‌ర‌ణ‌తో..క్రియాశీలక ఆచ‌ర‌ణతోనే స‌మాధానం చెప్పాలి. కానీ కేసీఆర్ నిర్ణ‌యాలు తీసుకున్నంత వేగంగా వాటి అమ‌లు లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆధారాల‌తో స‌హా మాట్లాడుతున్నాయి. అవి త‌మ గొంతుక‌ను బ‌ల‌ప‌రిచే విధంగా కొన్ని గ‌ణాంకాల‌నుతెర‌పైకి తెచ్చాయి కూడా! కేసీఆర్ ఆ రోజు వినిపించిన ఆత్మ గౌర‌వ నినాదం మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కూ వ‌ర్తిస్తుంద‌ని, అది మ‌రిచిపోయి ఒక్క ద‌ళితుల‌కే 1200 కోట్ల రూపాయ‌ల మేర వెచ్చించడం స‌బ‌బు కాద‌ని అంటున్నాయి. వీటికి కేసీఆర్ నుంచి రావాల్సిన స‌మాధానాలు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి.. అవి ఎలా ఉంటాయో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి: