ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కాకముందే.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు వెడేక్కాయి. ఇప్పటికే అన్ని పార్టీలు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాగా వేసి.. ప్రచారాన్ని ముమ్మురం చేశాయి. ఇందులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరియు బీజేపీ పార్టీ దూసుకుపోవడం విశేషం. అంతేకాదు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఓడగొట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇతర పార్టీలో ఉన్న కీలకమైన లీడర్లకు గులాబీ కండువా కప్పుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన.. కాంగ్రెస్‌ మాజీ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి ఇటీవలే... కారెక్కారు. 

తాజాగా బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి... ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హుజురాబాద్ లో జరుగుతున్న పరిణామాల పై అలకబునిన పెద్దిరెడ్డి... నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి.  అయితే.. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన.. ఇనుగాల పెద్దిరెడ్డి... ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. 

అతి త్వరలోనే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని ప్రకటించారు పెద్దిరెడ్డి.. బీజేపీ పార్టీలో పరిస్థితి లు తనకు అస్సలు నచ్చలేదని పేర్కొన్న పెద్దిరెడ్డి... ప్రస్తుతం బీజేపీ పార్టీపై విమర్శలు చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరిక విషయం లో నాకు గౌరవము ఇవ్వలేదని బీజేపీ పార్టీపై మండిపడ్డారు పెద్దిరెడ్డి. టీఆర్‌ఎస్ పార్టీ తీసుకువచ్చిన... అభివృద్ధి సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. trs అభ్యర్థి గెలుపు కోసం.. హుజురాబాద్‌ నియోజకవర్గంలో కృషి చేస్తానని ప్రకటించేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కాగా.. 2018 ఎన్నికల్లో పెద్దిరెడ్డి బీజేపీ పార్టీ తరఫున హుజురాబాద్‌ లో పోటీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp