ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచె అందరూ ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో  వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే  టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి నుంచి మళ్లీ గెలిచి తీరుతాను అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు ఈటెల రాజేందర్.



 ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ అధిపతిగా కొనసాగుతున్న కేసీఆర్ ఈటెల రాజేందర్ సవాల్ ను ఎంతో సీరియస్గా తీసుకున్నారు. ఇక ఊరుకుంటారా తనదైన శైలిలో ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వమే కెసిఆర్ చేతిలో ఉంది ఇంకేముంది..  ఇక హుజురాబాద్ ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్నో ఊహలు ఎన్నో పథకాలు ఇంకా ఎన్నో సంచలన నిర్ణయాలు ఇలా చెప్పుకుంటూ పోతే మునుపెన్నడూ హుజురాబాద్ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం కేసీఆర్. అంతే కాదు బిజెపిలోని కీలక నేతలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.



 ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దింపుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. బిజెపి తరఫున బిసి  వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఇప్పటికే ఖరారయ్యారు. ఇక టిఆర్ఎస్ తరఫున రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఒకవేళ టిఆర్ఎస్ ఇలా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని హుజరాబాద్ ఎన్నికల్లో నిలిపితే ఇక బీసీ వర్గానికి చెందిన ఉద్యమ నేత ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉందట తెలంగాణ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు సగరం రవి కి టికెట్ ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31 న జరగబోయే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: