ప్ర‌స్తుతం దేశంలో ఆధార్ అనేది ఎంత ప్రాముఖ్య‌త ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ చిన్న ప‌ని అయినా స‌రే ఆధార్ ఉండాల్సిందే. అలాంటి ఆధార్‌ను తీసుకోవ‌డం చాలామందికి క‌నీసం ఎలాగో కూడా తెలియ‌దు. అయితే అదెలాగో ఇప్పుడుత ఎలుసుకుందాం. ఒక‌వేళ మీకు 5ఏళ్ల వయస్సు ఉన్న కూతురు లేదా బాబు ఉన్నారా అయితే వీరికి గతంలోనే క‌చ్చితంగా మీరు ఆధార్ అప్లై చేసి ఉంటే అందులో కొన్ని మార్పులు ఎలా చేయాలో తెలుసుకుందాం.

వాస్త‌వానికి ప్ర‌తి ఒక్క పిల్లల కోసం బాలల‌కు సంబంధించిన‌ ఆధార్ కార్డు తీసుకునే ఉంటారు కాబట్టి అందులో తప్పనిసరిగా కొన్ని అప్డేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అవి అప్‌డేట్ చేస‌కుంట‌నే త‌ర్వాత మ‌న‌కు అన్ని ప‌నులు అయ్యేది. ఇక దేశ వ్యాప్తంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా  అనే సంస్థ మ‌నంద‌రికీ పిల్లల నుంచి మొదలుకుని వృద్దుల దాకా ఆధార్  అప్‌డేట్‌ల‌ను అందిస్తున్న విషయం విదిత‌మే కాగా.

అయితే మన కంట్రీలో చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా ప్రతి ఒక్కరూ ఆధార్ తీసుకోవడం చాలా ముక్య‌మ‌నే చెప్పాలి. అలాంట‌ప్పుడే పుట్టిన పసికందు పేరుతో స‌హా ఆధార్ తీసుకోవడానికి మ‌న‌కు అవ‌కాశం ఉంటుంది. అయితే చిన్న పిల్లలు ఉంటే వారి డీటేయిల్స్ ఎలా అప్‌డేట్ చేయాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌. ఇందుకోసం ఈ బాల ఆధార్ తీసుకునేట‌ప్పుడు కేవ‌లం మ‌న పిల్ల‌ల‌ ఫోటో మాత్రమే తీసుకుంటార‌ని తెలిసిందే.

అయితే చిన్న పిల్ల‌ల‌ప్పుడు తీసే ఆధార్‌కు బయోమెట్రిక్స్ అదేనండి వేలిముద్రలు లింకు చేయకుండానే ఇస్తారు. కాగా చిన్న పిల్లలకు క‌నీసం 5 ఏళ్లు నిండిన తర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లో వారి బయోమెట్రిక్స్ ను ఆధార్ కార్డులో క‌చ్చితంగా అప్ డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు యుఐడీఏఐ ఇందుకోసం మరోసారి ఐదు ఏళ్లు నిండిన వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని తాజాగా ప్ర‌క‌టిండం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి వెంట‌నే అప్ డేట్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: