ఏపీ లో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార వైసిపి అప్రతిహత విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి విజ‌యం సీఎం జగన్ సైతం ఊహించి ఉండరు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది. మరో ఏడాదిన్న‌ర‌కే 2024 ఎన్నికల వేడి అయితే ప్రారంభమవుతుంది. మరో రెండు నెలల్లో జగన్ క్యాబినెట్ ను భారీ స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 50 శాతానికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకవైపు కరోనా కష్టకాలం... మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడంతో 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ లిస్టు లోనే అనంతపురం జిల్లా తాడిపత్రి కి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఉన్నారని వైసిపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఎన్నికల్లో పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి జేసీ వార‌సుడు జేసీ. అశ్మిత్‌ రెడ్డి పై విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల లోనే పెద్దా రెడ్డి పై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా జరగడం లేదని... వైసీపీ కేడర్ విరుచుకుపడుతోంది. ఇక ఆయన గెలుపు కోసం కష్టపడిన నాయకులందరినీ ఆయన పక్కన పెట్టేశారు అట.

విచిత్రం ఏంటంటే ఇటీవల జరిగిన మున్సిపల్ - కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద వైసిపి ఓడిపోయిన ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి. పైగా ఇక్కడ నుంచి పెద్దారెడ్డి ప్యామిలీకి భ‌ద్ద రాజకీయ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించారు.  తాడిపత్రి ఫలితంపై జగన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక స్థానిక క్యాడర్ కూడా పెద్ద రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ ప‌రిణామాల త‌ర్వాత స‌జ్జల రామకృష్ణారెడ్డి సైతం పనితీరు మార్చుకోవాలని ఆయనకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాడిపత్రి ప్రజలు కూడా తిరిగి జెసి ఫ్యామిలీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పెద్దా రెడ్డికి కచ్చితంగా సీటు రాదని వైసిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: