గోదావరిని నమ్ముకున్న ప్రాణాలు ఆ గోదావరే నట్టేట ముంచుతున్నా ఒడ్డున పడని ప్రాణాలు..ఇంతకాలం నిలువ నీడ ఇచ్చిన అడవి తల్లిని వద్దనుకుని పునరావాసం కోసం అర్థిస్తున్న ప్రాణాలు ఇప్పుడు గుప్పెడు ధైర్యం కోసం వెతుకులాట సాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. వారు ఓడిపోతున్నా కొందరు జీవనాధారం లేక ప్రాణాలు కోల్పోతున్నా కదలిక లేని యంత్రాంగం కారణంగా వీరంతా దిక్కుతోచక ఉన్నారని గిరిజన సంఘాలు వాపోతున్నాయి. ఇంత జరిగినా ఇళ్లు పోయిన వారు భూములు పోయిన వారు ఏటా నీట మునిగి పోతున్నా పరిహారం మాత్రం  రావడం లేదు. ఏళ్లకు ఏళ్లు అం చనా వ్యయాల పెంపులోనే ఉన్న శ్రద్ధ వీరిని ఆదుకోవడంలో లేదు అన్న బాధ ఉంది అందరిలో! ఈ నేపథ్యంలో చావు బతుకుల కొట్లాటల మధ్య తమ జీవితాలు జీవ సమాధి అవుతున్నా వీరంతా ఉన్న ఊరితో ఉన్న బంధం తెంపుకోలేకపోతున్నా రు. ప్రాజెక్టు పుణ్యమాని  ఇక్కడ విలువైన అటవీ ప్రాంతం అంతా ముంపునకు గురి కావడమే కాకుండా తమ సంస్కృతి తమకు కాకుండా పో తోందని, ఇంతకాలం కాపాడుతూ వస్తున్న ఈ ఆచారాల పరిరక్షణ బాధ్యత  ఇకపై ఎవరిదని? కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అడ వితో బంధం తెంపుకుని బతుకుతున్నా ఒక పూట తిని ఒక తినక పస్తులుంటున్నా తమకు ఇప్పటి పరిస్థితి ఏమీ అర్థం కాకుండా ఉందని అంటున్నారు.. 


ఈ నేపథ్యంలో...ఓ వైపు పోలవరం ప్రాజెక్టుకు నిధుల చెల్లింపుపై రగడ నెలకొంటే మరోవైపు ముంపు బాధితుల గోడు తీవ్రతరం అయింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక గత రెండ్రోజులుగా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. త్యాగాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ అధికారులను కదలనివ్వడం లేదు. ప్రాజెక్టుకు సంబంధించి బ్యాక్ వాటర్ చేరి తూర్పుగోదావరి జిల్లాదేవీ పట్నం మం డలంలో పలు గ్రామాలు నీటమునిగాయి. అయితే ఇక్కడ నిర్వాసితులు తాము కదిలేదే లేదని, తమకు పరిహారం చెల్లిం చకుంటే ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. చనిపోయిన వారికి అయినా యాభై లక్షల రూపాయల మేరకు పరిహారం వస్తుందని కానీ తమ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, ప్రాజెక్టు కారణంగా ఇళ్లు పోయి, భూము లు పోయి స్మశానం తలపించేలా ఇక్కడి వాతావరణం ఉన్నా తమకు కదల్లేని పరిస్థితి నెలకొని ఉందని, తమ పోరాటం న్యాయం కోసమేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: